చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు

అట్టహాసంగా సినిమా ప్రారంభమయ్యాక అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయే సినిమాలు చాలావున్నాయి. ప్రతి హీరో కెరీర్ లో ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. తెలుగులో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి సినిమాలు కూడా షూటింగ్ జరుపుకొని ఆగిపోయినవి చాలావున్నాయి. సెట్స్ పైకి రాకుండా కొన్ని, సెట్స్ పైకి వచ్చి కూడా అనివార్య కారణాలతో ఆగిపోయిన సినిమాల వివరాలు తెలుసుకుందాం.

భూలోక వీరుడు
బాలకృష్ణతో ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సింగీతం శ్రీనివాసరావు చిరంజీవితో భూలోకవీరుడు పేరుతో జానపద చిత్రాన్ని తీయాలనుకున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దీనికి ప్లాన్ చేశారు. సినిమా మొదలైనప్పటికీ ఎందుకనే ముందుకు సాగలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు ముందు భూలోకవీరుడు పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించారు. తర్వాత ఎందుకనో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

in chiranjeevi career stopped movies list

వినాలని ఉంది
రామ్ గోపాల్ వర్మ కెరీర్ సూపర్ స్థాయిలో ఉన్నప్పుడు చిరంజీవి హీరోగా సినిమా మొదలుపెట్టారు. దీనికి కూడా అశ్వనీదత్ నిర్మాత. టబు, ఊర్మిళ హీరోయిన్లు సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే అదే సమయంలో సంజయ్ దత్ జైలునుంచి విడుదలయ్యాడు. దీంతో దీన్ని వదిలేసి వర్మ బాలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఆ సినిమా అలాగే మరుగుపడిపోయింది. ఈ సినిమా కోసం రెండు పాటలను కూడా చిత్రీకరించారు. చూడాలనివుంది సినిమా వందరోజులు పూర్తిచేసుకున్న తర్వాత ఈ రెండు పాటలను ఈ సినిమాలో యాడ్ చేశారు.

బాగ్ధాద్ గజదొంగ
సురేష్ కృష్ణతోపాటు ఓ హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో హాలీవుడ్ సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో ఓ మతానికి సంబంధించిన పుస్తకంపై వివాదం రేగి ఎక్కువ దూరం ప్రయాణించింది. నిర్మాతలు కొత్తవారు కావడంతో సరిగా డీల్ చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు అలాగే మరుగుపడిపోయింది. భాషా చిత్రం తర్వాత సురేష్ కృష్ణ ఈ సినిమా చేయానుకున్నారుకానీ అర్థాంతరంగా ఆగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+