ఎన్ని సినిమాలు వచ్చినా ‘ఇరుముడి’ రికార్డును టచ్ చేయలేకపోతున్నాయి!

టాలీవుడ్‌లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించినా, కొన్ని రికార్డులు మాత్రం చెక్కుచెదరవు. సరిగ్గా అలాంటి అరుదైన మైలురాలినే అందుకుని ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశారు మాస్ మహారాజా రవితేజ. గత ఆగస్టు 21న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అసలు ఈ సినిమాపై థియేటర్లలో కనిపించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మూతపడిన అనేక థియేటర్లు సైతం ఈ సినిమాతో మళ్లీ తెరుచుకున్నాయంటే దీని స్థాయి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. కొన్ని ప్రాంతాల్లో కొన్న ధర కంటే పది రెట్లు అధిక లాభాలను తెచ్చిపెట్టి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఏకైక తెలుగు సినిమా
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఏకైక తెలుగు సినిమా
Irumudi No Film Has Managed to Break Its Record No Matter How Many Movies Release

కలెక్షన్ల సునామీ

దాదాపు రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన 'ఇరుముడి' ఏకంగా రూ.150 కోట్లకు పైగా షేర్, రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. 105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక చిత్రంగా ఈ సినిమా నిలిచి రవితేజ కెరీర్ గ్రాఫ్‌ను అంబరాన్ని తాకేలా చేసింది. ఎన్ని పెద్ద సినిమాలు వస్తున్నా, ఈ సినిమా పేరిట ఉన్న ఒక పటిష్టమైన రికార్డును మాత్రం ఇప్పటివరకు ఏ హీరో సినిమా కూడా టచ్ చేయలేకపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వరుసగా 20 రోజుల పాటు రోజుకు కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

రొమాన్స్‌తో మొదలై.. సైన్స్ ఫిక్షన్‌తో షాక్ ఇవ్వనున్న సినిమా!
రొమాన్స్‌తో మొదలై.. సైన్స్ ఫిక్షన్‌తో షాక్ ఇవ్వనున్న సినిమా!

టాప్ ప్లేస్ లో నిలిచింది

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఈ రికార్డులో 'ఇరుముడి'నే టాప్ ప్లేస్‌లో ఉంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో బాహుబలి సీక్వెల్ (28 రోజులు), పుష్ప సీక్వెల్ (26 రోజులు) తర్వాత స్థానం ఈ సినిమాదే కావడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో బాహుబలి మొదటి భాగం, 'సంక్రాంతికి వస్తున్నాం', 'హనుమాన్' సినిమాలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. 'ఇరుముడి' తర్వాత ఎంతో భారీ హైప్‌తో వచ్చిన 'ది ప్యారడైజ్', 'రణబాలి', 'జైలర్ 2' లాంటి సినిమాలు సైతం కనీసం 10 రోజులు కూడా కోటి షేర్ మార్క్‌ను అందుకోలేకపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+