సౌందర్య మరణానికి మోహన్ బాబే కారణమా.. ?

హీరోయిన్ సౌందర్య గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమాని లేరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఈ రెండు కలిసి ఉన్న నటే సౌందర్య. ఈ రెండిటితో పాటు అదృష్టాం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కొ సినిమా చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందింది.

అయితే సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి అని చెప్పాలి. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి సినిమాల్లో సౌందర్యకు ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌‌గా నిలిచాయి. దీంతో సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారామె. తర్వాత తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది.

Is Mohan Babu responsible for Soundarya s death

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఈక్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు. బెంగుళూరు నుండి కరీంనగర్‌కి వెళ్లే క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె బ్రదర్ సైతం మరణించారు.అయితే ఆమె మరణానికి మోహన్ బాబు కూడా ఓ కారణం అయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించి దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

సౌందర్య చివరిగా మోహన్ బాబుతో శివ శంకర్ అనే మూవీలో నటించారు. ఈ సినిమాకు కాపుగంటి రాజేంద్రనే దర్శకుడు. ఆయన మాట్లాడుతూ..మోహన్ బాబు సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ఎవరికి సెలవులు ఇవ్వరని కాపుగంటి రాజేంద్ర తెలిపారు. సౌందర్యకు మాత్రం బీజేపీ పార్టీ ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆయన అనుమతులు ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.ఒకవేళ సౌందర్యకు మోహన్ బాబు సెలవులు ఇవ్వకపోతే.. ఆమె మరణించేవారు కాదు. బీజేపీ పార్టీ ప్రచార సభల్లో పాల్గొనేవారు కాదని.. కాపుగంటి రాజేంద్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+