సింహ రాశి, కన్యారాశి వారి జులై నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతుంటాయి. కొన్ని రాశులకు కలిసివస్తుంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంకొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖగోళంలో గ్రహాల కలయికతో ఈ పరిణామాలు ఏర్పడుతుంటాయి. అలాగే జులై నెలకు సంబంధించి సింహరాశి, కన్యారాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
సింహ రాశి
(మఖ, పూర్వ ఫల్గుణి/పుబ్బ, ఉత్తర ఫల్గుణి 1వ పాదం)
జులై నెల సింహ రాశి వారికి ఉత్సాహాన్ని, వ్యాపార-ఉద్యోగ రంగాల్లో మంచి ప్రగతిని అందిస్తుంది. అయితే ఆర్థిక, విషయాల్లో కొంత ఆలోచనాత్మక నిర్ణయాలు అవసరం. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా అను అనుకూలమైన చోటకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. మీ ఆత్మవిశ్వాసంతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది.

అయితే ఆధ్యాత్మిక విషయాలకు, కుటుంబ అవసరాలకు అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. పిల్లల పురోగతి లేదా వారి విద్యకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల్లో కొద్దిపాటి అలసట మినహా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
కన్యా రాశి
(ఉత్తర ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
కన్యారాశి వారికి ఈ నెల క్రమశిక్షణ, ప్రణాళికలతో వ్యవహరిస్తే విశేష లాభాలు లభించే సమయం. వృత్తి-వ్యాపారాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటాయి.ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు క్రమశిక్షణతో పెట్టుబడులను నిర్వహించి మంచి ఫలితాలను రాబట్టుకుంటారు. ధన ప్రవాహం సాఫీగా సాగుతుంది. గతంలో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండదు. అయితే ఎవరికీ హామీలు ఉండకూడదు, అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
బంధుమిత్రులతో విరోధాలు రాకుండా మాట పట్టింపులు తగ్గించుకోవాలి. నెల ద్వితీయార్థంలో కుటుంబ సమస్యలు సమసిపోయి ప్రశాంతత లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. పనిఒత్తిడి వల్ల మానసిక అలసట లేదా చిన్నపాటి శ్వాసకోశ, జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. సరియైన ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మేలు చేస్తుంది.












Click it and Unblock the Notifications