తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త.. తెలంగాణాలోని ఈ జిల్లాల నుండి స్పెషల్ ట్రైన్

తెలంగాణ వాసులకు శుభవార్త. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ వాసులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు చెప్పింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల భక్తులకు వీకెండ్ స్పెషల్ రైలును అందించింది. ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో నాందేడ్ నుండి తిరుచానూరు వరకు కొత్త వీకెండ్ ప్రత్యేక రైలు సర్వీస్ ను ప్రారంభించనుంది.

తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త

ఈ రైలు నిజామాబాద్, ఆర్మూరు, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి స్టేషన్ల మీద ప్రయాణం చేస్తుంది. ఇది తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు చాలా సౌకర్యవంతమైన, సమయానుకూల మైన ప్రయాణం అందిస్తుంది. రైల్వే అధికారులు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ట్రైన్ నెంబర్ 07603 నాందేడ్ నుండి తిరుచానూరు స్పెషల్ ట్రైన్ ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు నాందేడ్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది.

Tirupati special train devotees planning to visit Tirumala Special train from these districts in Telangana

ఈ మార్గంలో ప్రత్యేక రైలు సేవలు

సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ జంక్షన్ కు చేరుకుంటుంది. నిజామాబాద్ జంక్షన్లో ఐదు నిమిషాలు ఆగుతుంది. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ కు చేరుకుని అక్కడ రెండు నిమిషాలు అవుతుంది. ఆపై కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా ప్రయాణం కొనసాగించి మరుసటి రోజు అయినా బుధవారం రోజు ఉదయం 11 గంటలకు తిరుచానూరు స్టేషన్ కు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణం ఇలా

అక్కడ నుండి భక్తులు సులభంగా తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ రైలు ద్వారా తిరుగు ప్రయాణం కూడా అంతే సౌకర్యంగా ఉంటుంది. ట్రైన్ నెంబర్ 07604 తిరుచానూరు నాందేడ్ ప్రత్యేక రైలు ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1. 20 గంటలకు తిరుచానూరు నుండి బయలుదేరుతుంది. కోరుట్ల, జగిత్యాల మార్గంలో ప్రయాణించి గురువారం ఉదయం 6.50గంటలకు నిజామాబాద్ చేరుతుంది. ఆపై సాయంత్రం 4.58గంటలకు ఆర్మూర్ కు చేరుకుంటుంది.

తెలంగాణాలో కొత్త మామునూరు, అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై తీపికబురు!
తెలంగాణాలో కొత్త మామునూరు, అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లపై తీపికబురు!

ప్రత్యేక రైలు అప్పటి వరకు మాత్రమే

ఈ సమయాలు తెలంగాణా లోని వివిధ ప్రాంతాల భక్తులకు సురక్షిత ప్రయాణం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలు జులై 21, 2026 నుంచి ప్రారంభమై ఆగస్ట్ 26 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తిరుమలకు వెళ్ళే భక్తులకు సాధారణ రైళ్ళలో టికెట్లు దొరకకపోవటం, భక్తుల రద్దీ, అసౌకర్యాల వంటి కారణాలతో రైల్వే ప్రత్యేక రైలు సర్వీస్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు నిజంగానే శుభవార్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+