పసిడి ధరలు రీబౌండ్- లాస్ రికవరీ చిగురించిన ఆశలు: రేట్లల్లో కరెక్షన్
దేశంలో పసిడి ధరలు పుంజుకున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. ఈ పెరుగుదల స్వల్పమే. అయినా కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న పతనానికి బ్రేకులు పడినట్టయింది. అన్ని రకాల క్యారెట్ల బంగారం ధరలు సానుకూలంగా మారాయి. ఇటీవల నెలకొన్న నెలవారీ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలుదారులు మళ్లీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో పసిడి కొంత కోలుకుంది. మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చి చూస్తే కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించింది.
తాజా రిటైల్ మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 1,43,570 రూపాయలుగా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే ఇది గ్రాముకు 770 రూపాయల మేర పెరిగింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములకు రూ. 700 చొప్పున పెరగి 1,31,600 రూపాయలకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధరలో కూడా పతనానికి బ్రేక్ పడింది. 10 గ్రాములకు రూ. 570 పెరిగి రూ. 10,767 వద్ద స్థిరపడింది.

ఇటీవలి రోజుల్లో వరుసగా పడిపోతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు తిరిగి పుంజుకున్నప్పటికీ, జులై మొదటి వారంలో నమోదైన రికార్డు స్థాయిలతో పోలిస్తే ఇవి ఇంకా తక్కువే. ఈ నెల ప్రారంభంలో ధరలు గరిష్ట స్థాయిలకు చేరడంతో సామాన్య కొనుగోలుదారులు ధరలు తగ్గుతాయేమోనని వేచి చూశారు. కొద్ది రోజులుగా మార్కెట్లో చోటుచేసుకున్న ఈ కరెక్షన్ వల్ల పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. తద్వారా లభించిన ఈ తాత్కాలిక ధరల ప్రయోజనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,378, 22 క్యారెట్లు - రూ. 13,180, 18 క్యారెట్లు - రూ. 10,000
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,357, 22 క్యారెట్లు- రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,767
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,357, 22 క్యారెట్లు- రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,767
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,357, 22 క్యారెట్లు- రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,767
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,357, 22 క్యారెట్లు- రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,767
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,357, 22 క్యారెట్లు- రూ. 13,160, 18 క్యారెట్లు - రూ. 10,767

Click it and Unblock the Notifications