ట్రంప్ యూ-టర్న్: భారత్, చైనాలకు బంపర్ ఆఫర్!
రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల విషయంలో అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో మళ్లీ యుద్ధ వాతావరణం ముదురుతున్న సమయంలో రష్యాపై ఆంక్షలు విధించే బిల్లును అమెరికా సెనేట్ సవరించింది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలుదారులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించడం కూడా ఇందులో భాగంగా ఉంది. రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్, చైనాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతిపాదించిన సవరణ భారత్, చైనాలకు ఊరటనిచ్చింది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై గతంలో ప్రతిపాదించిన గరిష్టంగా 500% సుంకాన్ని 100%కి తగ్గించే బిల్లును రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనేటర్లు మంగళవారం చట్టంగా ప్రవేశపెట్టారు. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుకూలమని భావిస్తే, ఆంక్షలను ఎత్తివేసే అధికారాన్ని కూడా ఈ సవరించిన బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పిస్తుంది.

అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన సవరించిన బిల్లు.. భారత్, చైనాలతో పాటు రష్యా ముడి చమురును కొనుగోలు చేసే మొదటి 5 దేశాలకు వర్తిస్తుంది . దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ మొదట ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఉభయపక్షాల మద్దతు ఉంది. రాయిటర్స్ ప్రకారం, సవరించిన బిల్లుకు ప్రస్తుతం 26 మంది కో-స్పాన్సర్లు ఉన్నారు. ఇది కాంగ్రెస్‌లో ముందుకు సాగే కొద్దీ మరింత మద్దతు పొందే అవకాశం ఉంది, దీంతో పాత ప్రతిపాదనతో పోలిస్తే ఈ కొత్తగా సవరించిన బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 2026 ప్రారంభంలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి చర్చలకు నిరాకరిస్తున్న పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ సర్కారు రష్యా చమురు కొనుగోలుదారులపై కఠిన వైఖరి తీసుకుంది. రష్యా నుంటి చమురును కొనుగోలు చేసే దేశాల ఉత్పత్తుల 500 శాతం వరు సుంకాలు విధించేలా 'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025'కు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి పరిష్కారం కోసం చర్చలు జరపడానికి నిరాకరించిన పుతిన్ ప్రభుత్వంపై ఉక్కు చర్యగా ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యను ప్రత్యేకంగా అభివర్ణించింది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (WEF దావోస్ 2026)లో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సాంట్ ఈ బిల్లు గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications