ఐటీ తర్వాత టార్గెట్ ఈ ముగ్గురు హీరోలే? రంగం సిద్ధం!

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖుల కార్యాలయాలపై నాలుగు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్త్రతంగా దాడులు నిర్వహిస్తున్నారు. 55 మంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో వీటిని చేపట్టారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీస్, నెక్కంటి శ్రీధర్, మ్యాంగో మీడియా రామ్ తదితరుల కార్యాలయాలపై, ఇళ్లల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పత్రాన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీ అధికారులు ఎంతో పకడ్బందీగా దాడులు నిర్వహించడంతోపాటు ప్రతి అంశాన్ని, ప్రతి రూపాయిని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు.

సినిమాలపై వందల కోట్లరూపాయలు గుమ్మరిస్తున్నారు
కొన్నాళ్లుగా పరిశ్రమలో వందల కోట్లరూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు. తమకు ఇన్ని కలెక్షన్లు వచ్చాయంటూ పోస్టర్లు ప్రకటిస్తున్నారు. ఆదాయపు పన్ను కట్టే సమయంలో మాత్రం ఈ ప్రకటనలకు భిన్నంగా ఆదాయాన్ని చూపెడుతున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా జూలు విదిల్చారు. నాలుగురోజులుగా జరుగుతున్న సోదాలు మరో రెండుమూడు రోజులు కొనసాగే అవకాశం ఉదని, తర్వాత టార్గెట్ హీరోలేనని తెలుస్తోంది. వీరిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇళ్లపై దాడులు ఉండవచ్చనే అభిప్రాయం వినపడుతోంది. ఈ ముగ్గురు వందల కోట్లరూపాయల పారితోషికాన్ని పొందుతున్నారు. అందుకు భిన్నంగా ఆదాయపు పన్ను కడుతుండటంతో వీరిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

IT officials are going to raid Prabhas junior NTR and Allu Arjun in the next three days

తర్వాత ఈ ముగ్గురిపైనే దాడులు?
ప్రభాస్ ఇటీవలే హోంబలే ఫిలింస్ తో ఒప్పందం కుదుర్చుకొని మూడు సినిమాలకు కలిపి రూ.350 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు రూ.120 నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సినిమా లాభాల్లో తారక్ వాటా తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు రూ.300 కోట్లు తీసుకున్నట్లు బహిరంగంగానే ఆయన తరఫు వ్యక్తులు ప్రకటించారు. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున రూ.300 కోట్లు తీసుకున్నట్లు బన్నీ వాసు లాజిక్ చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఐటీ శాఖ ఒక్కసారి లెక్కలు చూస్తే సరిపోతుందిగా అని భావించింది. రాబోయే రెండుమూడు రోజుల్లో ఈ ముగ్గురు హీరోలపై దాడులు ఉండొచ్చని సమాచారం అందుతోంది. అందుకు ప్రధాన కారణం అడ్వాన్స్ ల రూపంలోనే వీరు వందల కోట్లరూపాయలు తీసుకోవడం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+