సెంట్రల్ జైల్లో ఉండే నటి గర్భవతి ?,హడలిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్,ఏది నిజం?
శ్యాండిల్ వుడ్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమానులు షాక్ అయ్యే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హత్య కేసులో ఏ1 నిందితురాలిగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న స్టార్ హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్, కన్నడ సినీ నటి పవిత్ర గౌడ ఇప్పుడు గర్బవతి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని గాంధీనగర్ లో ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
హత్యా నేరం కింద బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్న పవిత్ర గౌడ గర్బవతి అని కన్నడ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఉండే బెంగళూరులోని గాంధీనగర్ లో వీదివీదిలో చర్చ జరుగుతోంది. గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ మాట విని ఆవేశపడిన హీరో దర్శన్, ఆయన సన్నిహితులు ఇప్పుడు సెంట్రల్ జైలులో కటకటాలు లెక్కపెడుతున్నారు. ఇలాంటి సమయంలో నటి పవిత్ర గౌడ మళ్లీ గర్భవతి అనే వార్త సంచలనం రేపింది.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ అరెస్టు కావడంతో ఇప్పుడు విచారణ ఖైదీలుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బెంగళూరు పరప్ప అగ్రహార జైల్లోని కటకటాల వెనుక హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ అష్టకష్టాలు పడుతూ కాలం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా బెంగళూరులోని గాంధీనగర్ వీధుల్లో ఇంకో కొత్త వార్త కలకలం రేపుతోంది. ఈ వార్త భారీ సంచలనం సృష్టించడానికి కారణం పవిత్ర గౌడ మళ్లీ గర్భవతి అనే సమాచారం.
అయితే ఈ వార్త నిజమేనా ?, పవిత్ర గౌడ ఇప్పుడు తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో హీరో దర్శన్ అభిమానులు సైతం ఆ విషయం గురించి ఆరా తియ్యడం మోదలుపెట్టారు. నటి పవిత్ర గౌడ ఇప్పుడు గర్భవతిగా ఉందా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నటి పవిత్ర గౌడ గర్భవతి అనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో, గాంధీనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగానే కాకుండా బెంగళూరులోని గాంధీ నగర్ వీధుల వరకు దీనిపై భారీ చర్చ మొదలైంది. నటి పవిత్ర గౌడకు అప్పటికే ఒక కుమార్తె ఉంది. పవిత్ర గౌడకి మొదటి భర్త కారణంగా ఒక బిడ్డ పుట్టింది. తరువాత భర్తతో విడిపోయిన నటి పవిత్ర గౌడ ఇప్పుడు వేరుగా ఉంటున్నది. ఇప్పుడు భర్తతో విడిపోయి మరో పెళ్లి చేసుకోకుండా కూతురితో కలిసి ఉంటున్న నటి పవిత్ర గౌడ మళ్లీ గర్భవతి అనే వార్త బయటకు రావడం కలకలం రేపుతోంది.
నటి పవిత్ర గౌడ తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందన్న వార్త సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. అయితే హీరో దర్శన్ తో ాపటు నటి పవిత్ర గౌడ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరో దర్శన్ అభిమానులు మండిపడుతున్నారు. కావాలనే హీరో దర్శన్ ను ప్రజల్లో చెడ్డవాడిగా చూపించడానికి ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, ఇది గాలి వార్తలు అని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఈ దెబ్బతో చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. ఇలా ప్రతి క్షణం హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ గురించి ఏదో ఒక వార్త, ఊహాగానాలు సృష్టించి ఆయన అభిమానులతో ఆడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్ట్ లు, కొన్ని వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
నటి పవిత్ర గౌడ మరో బిడ్డను కనేందుకు ప్లాన్ చేసిందంటూ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆరోపణలు, చర్చలలు మొదలైనాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నటి పవిత్ర గౌడ గురించి ఈ గాలి వార్తను కొందరు కావాలనే మీడియాలో ప్రచారం చేస్తున్నారని హీరో దర్శన్ అభిమానులు మండిపడుతున్నారు. భర్తను వదిలేసిన నటి పవిత్ర గౌడ హీరో దర్శన్ తో చనువుగా ఉంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications