పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ భార్య రచ్చ
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనని కొద్దికాలంగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. గత మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్‌ను యాడ్ చేశారు.

ఇక జానీ మాస్టర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో గురువారం అరెస్ట్ చూపించి.. శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న అతని భార్య అయేషా మీడియా వాళ్లతో అతిగా ప్రవర్తించారు. అక్కడున్న వారితో అయేషా దురుసుగా ప్రవర్తిస్తూ రుసరుసలాడారు. జానీపై కేసుకు సంబంధించి వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. అందరిపై కేసులు పెడతానంటూ బెదిరించారు. అయితే బాధితురాలు జానీ మాస్టర్ భార్యపై కూడా ఆరోపణలు చేశారు.
అయేషా సైతం తనని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. మతం మారి జానీ మాస్టర్‌ను రెండో పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది. ఓసారి ఇంటికి వచ్చి జానీ మాస్టర్, ఆయన భార్య అయేషా బెదిరించారని.. భార్య అయితే.. పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు. తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని, మతం మారాలంటూ బెదిరించారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో బాధితురాలు పేర్కొంది.












Click it and Unblock the Notifications