మహేష్ బాబు "వారణాసి" మూవీలో జూ.ఎన్టీఆర్ కుమారుడు..

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

jr-ntr-son-bhargav-ram-playing-important-role-in-mahesh-babu-varanasi-movie-and-news-got-viral

ఈరోజు మెక్సికో సిటీలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ CCXP MX 2026లో 'వారణాసి' టీమ్ సందడి చేసింది. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను ప్రదర్శించగా.. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌కు అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచం చూడని సరికొత్త మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారని చెప్పారు. 2027 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ బాలనటుడిగా తెరంగేట్రం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఆయన ముద్దులొలికే ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే వారణాసి మూవీ మహేష్ చిన్ననాటి పాత్రలో భార్గవ్ రామ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌కు రాజమౌళి, మహేష్‌తో బలమైన అనుబంధం ఉంది. రాజమౌళి కెరీర్ 'స్టూడెంట్ నెం.1'తోనే ప్రారంభమైనందున ఎన్టీఆర్‌తో ఆయనకు విడదీయరాని స్నేహం ఉంది. దీంతో వారి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా అందుకు తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రచారం నిజమైతే బాలనటుడిగా భార్గవ్ కు మరిన్ని సినిమా అవకాశాలు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+