ఎన్టీఆర్, అల్లు అర్జున్... బావలిద్దరికీ ఇష్టమైన హీరోయిన్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ కథానాయకుడిగా ఈనెల 15వతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయ్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇది నిర్మితమైంది. ఆయ్ తోపాటు విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్.. ఈ రెండు సినిమాలు ఆయ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ సినిమాలో నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత చిత్రబృందం అల్లుఅర్జున్, ఎన్టీఆర్.. ఇద్దరినీ కలుసుకున్నారు.
కళ్లతో చక్కగా హావభావాలు
సినిమాలో చాలా ఈజ్ తో నటించానని, క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశానంటూ యంగ్ టైగర్ అభినందించినట్లు సారిక వెల్లడించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే తనను దక్షిణాది భాషకు చెందిన అమ్మాయి అనుకున్నారని, కాదని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయారన్నారు. చక్కగా నటించావని, పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుందంటూ బన్నీ కొనియాడినట్లు సారిక తెలిపింది. అల్లు అరవింద్ అయితే కళ్లతో ఎంతో చక్కగా హావభావాలు పలికించానని ప్రశంసించారని, అంత పెద్ద స్టార్ల దగ్గర నుంచి ప్రశంసలు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇది మరిచిపోలేని విషయమని సారిక అంది.

ఘనవిజయంతో ప్రయాణం ప్రారంభమైంది
ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారని, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి ఘనవిజయం సాధించిన సినిమాతో తన ప్రయాణం ప్రారంభమైందని, ఒక సినిమా విజయం సాధించిందంటే అందుకు ఆ చిత్ర బృందం కృషి అంతా ఉంటుందన్నారు. ఈ సినిమాలో తనను భాగం చేసినందుకు గీతా ఆర్ట్స్ కు, దర్శకుడు అంజి కె.మణిపుత్రకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు నయన్ సారిక. ఈ సినిమా సాధించిన విజయంతో ఈ అమ్మడుకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కథలైతే వింటున్నానుకానీ ఏదీ ఖరారు కాలేదని తెలిపింది. మంచి కథ, మంచి బ్యానర్, మంచి దర్శకుడు.. వీరితోనే తన భవిష్యత్తుకు బాటలు దిద్దుకుంటానని ఈ అమ్మడు చెబుతోంది.












Click it and Unblock the Notifications