బాలీవుడ్‌కు భారీ షాక్ ఇవ్వబోతున్న జూనియర్ ఎన్టీఆర్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కు భారీ షాకిచ్చే దిశగా తన ప్రణాళికలు రచించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ రావడంతో వెంటనే సినిమా చేస్తే మంచి ప్రయోజనం దక్కేది. కానీ ఆర్ఆర్ఆర్ విడుదలైన వెంటనే సినిమా చేయకుండా ఆలస్యం చేయడంతో ఆ క్రేజ్ క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈలోగా అల్లు అర్జున్ పుష్ప, పుష్ప2తో ఉత్తర భారతంలో కూడా భారీ క్రేజ్ తెచ్చుకోవడంతో తారక్ వెనకబడిపోయాడు. ఈసారి అలా కాకుండా ఉండాలని జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకుంటూ వస్తున్నారు. వరుసగా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.
మూడు దేశాలను గడగడలాడించిన స్మగ్లర్ కథతో..
తారక్ తాజాగా చేస్తున్న వార్2 నేరుగా బాలీవుడ్ లో చేస్తున్న సినిమా. ఇది ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. దీనికి ముందు విడుదలైన దేవరను రెండు భాగాలుగా కాకుండా కథ మొత్తం ఒకే సినిమాగా తీసివుంటే కనీసం రూ.వెయ్యి కోట్లపైనే వసూళ్లు వచ్చేవనే అభిప్రాయం ఉంది. అయితే రెండు భాగాలుగా చేయడంవల్ల సినిమా అందరికీ ఎక్కలేదు. తనకున్న క్రేజ్ తో ఎలాగోలా దాన్ని గట్టెక్కించాడు. వార్ 2 తర్వాత డ్రాగన్ తో సంచలనం సృష్టించాలనే యోచనలో ఉన్నాడు. మూడు దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ కథతో ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ నీల్ దర్శకుడు.

అల్లు అర్జున్ మొండిచేయి చూపడంతో..
వచ్చే ఏడాది వేసవికి ఇది విడుదల కానుంది. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా అనుకున్నప్పటికీ అనూహ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తూ త్రివిక్రమ్ కు మొండిచెయ్యి చూపడంతో వెంటనే అతను ఎన్టీఆర్ ను హీరోగా ఓకే చేయించుకున్నాడు.
సుబ్రహ్మణ్యస్వామి జీవిత చరిత్రలో ఎవరికీ తెలియని కథను త్రివిక్రమ్ తీయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. దీనితర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, భారీ బడ్జెట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా జెండా పాతాలనే లక్ష్యంతో జూనియర్ ఎన్టీఆర్ పనిచేసుకుంటున్నారు. బాలీవుడ్ ను షేక్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న తారక్ హిందీలోనే నేరుగా మరో చిత్రం చేయనున్నాడు. దీని వివరాలు బయటకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications