ఆ స్టార్ హీరో సినిమాలో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్?
హృతిక్ రోషన్ కథానాయకుడిగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోయే చిత్రం వార్ 2. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకంటే ముందుగానే బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హీరో చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న టైగర్ 3 లో క్లైమాక్స్ సన్నివేశంలో జూనియర్ కనిపించబోతున్నాడు. టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మనీశ్ శర్మ దర్శకుడు. వార్ 2 కంటే తారక్ బీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే టైగర్ 3లో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జూనియర్ నటిస్తే భారీ మల్టీస్టారర్ అవుతుంది. దీపావళి కానుకగా దీన్ని విడుదల చేయబోతున్నారు. వార్ ను తీస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థే టైగర్ 3ని కూడా తీస్తోంది. నిర్మాతలు ఈమేరకు తారక్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మరోవైపు వార్ 2 పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయాన్ తో ఇటీవలే ఎన్టీఆర్ చర్చలు జరిపారు. నవంబరులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది చివరల్లో ఇది ముగుస్తుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ దేవరను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కిలినేని సుధాకర్, నందమూలి కల్యాణ్ రామ్ నిర్మాతలు. తీర ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. వీలునుబట్టి డబ్బింగ్ చేసి ఇంగ్లిషులో కూడా విడుదల చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications