బిగ్ బ్రేకింగ్: హరిహర వీరమల్లు దర్శకుడి మార్పు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'హరిహర వీరమల్లు'. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కల్యాణ్ తన నటనతో ఆకట్టుకున్నారు. టీజర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తిచేయబోతున్నట్లు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లపై క్రిష్ పేరు లేదు. దీంతో కొందరు నెటిజన్లు సినిమా యూనిట్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.
హరిహర వీరమల్లు నుంచి క్రిష్ వైదొలిగారా? అనే ప్రశ్నలు అందరిలో రేకెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా దీనికి సంబంధించి నిర్మాతలు స్పష్టతనిచ్చారు. నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన జ్యోతికృష్ణ హరిహర వీరమల్లు మిగతా షూటింగ్ ను పూర్తిచేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సినిమా ఆలస్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత వెల్లడించారు.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. మొదటి భాగాన్ని ''స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'' పేరుతో విడుదల చేయబోతున్నారు. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. ఈ సంవత్సరం చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాబీడియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు నటించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా పవన్ కల్యాణ్ బిజీగా మారిపోయారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి స్వయంగా ఆయనే బరిలోకి దిగారు. దీంతో ముందుగా ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లుతోపాటు ఓజీ కూడా వాయిదా పడింది. ఎన్నికలవగానే వీటిని పూర్తిచేయనున్నారు.












Click it and Unblock the Notifications