Kaaka Movie: ‘కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!
Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబీనేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా 'కాకా'. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంతో తాజాగా వస్తున్న భారీ ప్రాజెక్టు 'కాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో చిరంజీవిని సరికొత్త, స్టైలిష్ అవతారంలో చూపించి అభిమానులను అలరించిన మేకర్స్.. చిరు సింపుల్ లుక్, యాక్షన్ సీక్వెన్సులతో సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా ఆ సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో తనదైన నటనతో మెప్పించి తెలుగులో స్పీడ్ పెంచిన హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి నటి అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో అనస్వర రాజన్ ఆకుపచ్చ రంగు చుక్కలున్న పంజాబీ డ్రెస్ ధరించి.. చేతిలో మెడికల్ పుస్తకాలు పట్టుకుని కనిపించారు. ఆమె లుక్ చాలా సింపుల్‌గా, ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ పోస్టర్లో అందరి దృష్టిని ఓ విషయం మాత్రం ఆకర్షించింది. అది ఆమె వెనుక ఉన్న నీడలో చిరంజీవి రూపం ప్రతిబింబించడమే. ఇది ఆమె పాత్రకు, చిరంజీవి పాత్రకు మధ్య ఉన్న తండ్రీకూతుళ్ల బంధాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

అనస్వర రాజన్ పాత్ర ప్రాధాన్యతను తెలపడానికి 'ఆయన ప్రపంచాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే అందమైన సమక్షానికి" అనే క్యాప్షన్ ను మేకర్స్ జోడించారు. ఈ సినిమాలో ఆమె 'అమ్ములు' అనే పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు. స్టోరీకి ఆమె పాత్రే హృదయస్పందన లాంటిదని.. ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్ల సమ్మేళనంగా ఉండబోతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాలో చిరంజీవిని స్టైలిష్‌గా చూపుతునే.. ఆయనలోని కామెడీ టైమింగ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ను పరిపూర్ణంగా ఆవిష్కరించేలా స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Happy Birthday to the
— Kaaka (@KaakaMovie) September 8, 2026
'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..
Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg














Click it and Unblock the Notifications
