Ranabaali Teaser: టీజర్ తో విజయ్ దేవరకొండ విధ్వంసం.. రాయలసీమ యోధుడిగా..!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు అద్దిరిపోయే వార్త. విజయ్ గత సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. కింగ్డమ్, ది ఫ్యామిలీ స్టార్, ఖుషి సినిమాలు, లైగర్ లాంటి సినిమాలకు మిశ్రమ స్పందన లభించింది. అంతకుముందు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. విజయ్ దేవరకొండకు పెద్ద హిట్ అంటే 2018లో వచ్చిన గీతాగోవిందం సినిమానే. ఆ తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ప్రెజెంట్ విజయ్ రణబాలి, రౌడీ జనార్ధన అలాగే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే రణబాలి చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

రణబాలి మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 9 టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన తాజాగా విడుదల చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో రానున్న రణబాలి మూవీ అక్టోబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్- రష్మిక వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు టీజర్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ నుంచి యాక్షన్ టీజర్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్ డ్ ల్యాండ్ రైజెస్ అంటూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

Ranabaali movie teaser on September 9 Awesome news for Vijay Deverakonda fans Ranabaali movie

రణబాలి సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చారిత్రక కథాంశంతో 19 వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రొమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమైపోతుంది. ఆ కాలంలో రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కరవు బ్యాక్ డ్రాప్.. అలాగే అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ వీరుడి కథే రణబాలి అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వచ్చిన టాక్సీవాలా మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+