స్టార్ హీరో ఫ్యాన్స్ కు షాక్, ఆపరేషన్ చెయ్యాలంటున్న డాక్టర్లు

శ్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని వెలుగు చూడడంతో ఆ హీరో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ కి చెందిన రేణుకస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్ సెంట్రల్ జైలుకు వెళ్లి సుమారు 110 రోజులు అవుతుంది. హీరో దర్శన్ బెయిల్ మీద బయటకు వస్తారని ఆయన ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు.

అయితే హీరో దర్శన్ మాత్రం బళ్లారి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. వైద్యులు హీరో దర్శన్ కి చికిత్స అందించారు. రాత్రిపూట కూర్చోలేక, నిలబడలేక, నిద్ర రాకపోవడంతో హీరో దర్శన్ నానా ఇబ్బందులు పడుతున్నాడని వెలుగు చూసింది. హీరో దర్శన్ కి వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

Kannada Hero Darshan is suffering from back pain in Bellary Central Jail

బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో హీరో దర్శన్ కి ఆపరేషన్ చేయడానికి వైద్యులు, పోలీసులు ప్లాన్ చేశారని తెలిసింది. అయితే బళ్లారిలో ఆపరేషన్ చేసుకోవడానికి హీరో దర్శన్ నిరాకరించారని, తాను బెంగళూరులో ఆపరేషన్ చేసుకుంటానని హీరో దర్శన్ వైద్యులకు చెప్పారని కన్నడ మీడియా తెలిపింది. బెయిల్ రాకుండా హీరో దర్శన్ బెంగళూరు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకోవడానికి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల కొన్ని రోజుల నుండి హీరో దర్శన్ రాత్రిపూట నిద్రరాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాడని కన్నడ మీడియా తెలిపింది. ఇటీవల హీరో దర్శన్ కు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో స్కానింగ్ చేసి ఆపరేషన్ చెయ్యాలాని వైద్యులు సూచించారు. అయితే దర్శన్ అందుకు అంగీకరించకపోవడంతో దర్శన్ మాట్లాడుతున్న సమయంలో అధికారులు వీడియో రికార్డు చేశారని తెలిసింది

వారం రోజుల క్రితం హీరో దర్శన్ ని ఆయన భార్య కలిశారు. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ ని ఆయన భార్య విజయలక్ష్మి, తల్లి మీనాతో పాటు కుటుంబ సభ్యులు కొందరు దర్శన్ ను కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. హత్య కేసులో హీరో దర్శన్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన వంద రోజులు దాటిపోయింది. హీరో దర్శన్ బెయిల్ పైన బయటకు వస్తారని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రేణుకస్వామి హత్య కేసులో ఏ 2 నిందితుడైన హీరో దర్శన్ ఎప్పుడు బెయిల్ పై బయటకు వస్తారో అనే విషయంపై చిన్న క్లూ కూడా అందకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+