రాహుల్ గాంధీ ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారా..?
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే. అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా బ్రహ్మచారిగానే మిగిలిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన సమయంలో పబ్‌లో అమ్మాయిలతో కనిపించిన ఫొటోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి.
ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ ప్రేమ విఫలం అయిందని , ఆయన అందుకే పెళ్లి చేసుకోవడం లేదనేది ఈ వార్త సారాంశం. ఆయన ఓ స్టార్ హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించారట. అయితే ఆమె మరోకర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆయన సింగిల్‌గానే ఉండిపోవాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ రాహుల్ గాంధీ ప్రేమించిది మరెవర్నో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కపూర్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి మధ్య మంచి బంధుత్వం ఉండేదని తెలుస్తోంది.

రాజీవ్ గాంధీకి రాజ్ కపూర్ కూతురు రీతూ కపూర్‌ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అప్పటికే రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో ప్రేమలో ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. కుదరలేదు. ఆ తర్వాత రాజ్ కపూర్ మనవరాలు కరీనాకపూర్‌కి రాహుల్ గాంధీ అంటే పిచ్చి ప్రేమ అని తెలుస్తోంది. ఓ ఇంటర్య్వూలో కరీనా మాట్లాడుతూ.. మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా ఠక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పిందట. దీంతో ఆమెకు రాహుల్ అంటే ఎంతటి ప్రేమో అందరికి తెలిసింది.
రాహుల్ గాంధీ సైతం కరీనా కపూర్ అంటే ఇష్టంగానే ఉండేవారని తెలుస్తోంది. ఆమె నటించిన సినిమాలు మొదటి రోజే చూసేవారట. అయితే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించడం,మోదీని ఎదురించే నాయకుడుగా ఎదుగుతున్న సమయం కావడంతో ప్రేమపై పెద్దగా శ్రద్ధ చూపించేవారు కాదట. పైగా పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారు. మరోవైపు కరీనా సైతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వీరి మధ్య క్రమక్రమంగా ప్రేమ అనేది తగ్గిపోతూ వచ్చిందని తెలుస్తోంది.
రాజకీయలో బిజీ బిజీగా ఉంటూ రాహుల్ పెళ్లికి దూరమయ్యారు. ఆ తర్వాత కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ 'తన నేత అభినేతా' అనే పుస్తకంలో రాసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications