స్టార్ హీరో కేసులో సంచలన నిర్ణయం, అదే జరిగితే ప్యాంట్ తడిచిపోతుంది !
హత్యకు గురైన రేణుకాస్వామి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చెప్పాలని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ శాసనసభ్యుడు బీ.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు. హీరో దర్శన్ కేసు రోజురోజుకు మలుపుతిరుగుతోంది. చిత్రదుర్గలో రేణుకాస్వామి కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేణుకాస్వామి ధర్మపత్ని నాలుగు నెలల గర్భిణి అని విజయేంద్ర తెలిపారు. ఆ మహిళలకు రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందించాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. రేణుకాస్వామి హత్య అమానవీయ చర్య అని, పౌరసమాజం నుంచి ఎవరూ దీన్ని సమర్ధించలేరని విజయేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. దర్శన్ చేసింది తప్పైతే రేణుకాస్వామి చేసింది కరెక్ట్ అని ఇప్పటికే ప్రజలు అంటున్నారు.

ఈ అంశం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే చర్చనీయాంశమైంది. రేణుకాస్వామి భార్యను, ఆయన తండ్రిని, తల్లిని, అమ్మమ్మను చూస్తే నిజంగానే బాధ కలుగుతుందని విజయేంద్ర అన్నారు. ఈ ఘటనలో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ విచారణ సక్రమంగా జరగాలని, నిందితులను వదులకూడదని ప్రజాలు డిమాండ్ చేస్తున్నారని విజయేంద్ర అన్నారు.
ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దోషులు, హంతకులకు తగిన శిక్షపడే విధంగా విచారణ చేపట్టాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర అన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రేణుకాస్వామి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కర్ణాటక హోంమంత్రిని విజయేంద్ర డిమాండ్ చేశారు.
రేణుకాస్వామి కుటుంబానికి నష్ట పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయేంద్ర అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని విజయేంద్ర అన్నారు. రేణుకాస్వామి హత్య కేసును సీబీఐకి అప్పగించించాలని విజయేంద్ర డిమాండ్ చేశారు. హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ మీద ఇప్పుడు అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications