Karthika deepam 2 December 19th:రక్తపు వాంతి చేసుకున్న సుమిత్ర..శ్రీధర్ అరెస్ట్..!!
బుల్లితెరపై తిరుగులేని ఆదరణ పొందుతున్న 'కార్తీకదీపం 2' సీరియల్ ఇప్పుడు ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో శౌర్య తన మాటలతో నానమ్మ కాంచన మనసును కరిగించడం, మరోవైపు జ్యోత్స్న-వైరాలు కలిసి శ్రీధర్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేయడం చూశాం. మరి నేడు డిసెంబర్ 19వ తేదీ, 545వ ఎపిసోడ్‌లో జరిగిన సంచలన పరిణామాలు ఇప్పుడు మీకోసం...
కాశీకి వైరా గాలం.. జీఎం పోస్ట్, 10 లక్షల బోనస్!
నేటి ఎపిసోడ్ ప్రారంభంలో జ్యోత్స్న ప్లాన్ ప్రకారం కాశీని తన దగ్గరకు పిలిపించుకుంటాడు వైరా. కాశీ పీఏగా పనిచేస్తున్నాడని తెలిసి, అతని పౌరుషాన్ని రెచ్చగొడతాడు. "నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు చేసే పనేంటి? నిన్ను కాలి కింద చెప్పులా చూస్తున్న వారి దగ్గర ఇంకెన్నాళ్లు ఉంటావు?" అంటూ నిలదీస్తాడు. కాశీకి ఏకంగా తన కంపెనీలో జనరల్ మేనేజర్ (GM) పోస్ట్ ఆఫర్ చేస్తాడు. అంతేకాకుండా, జాయినింగ్ బోనస్ కింద 10 లక్షల రూపాయలు, కారు, సొంతిల్లు ఇస్తానని ఆశ చూపుతాడు. ఈ క్రమంలో జ్యోత్స్న కూడా కాల్ చేసి, ఇది తన పవర్ అని, ఇకపై ఎవరి దగ్గరో బానిసలా ఉండాల్సిన అవసరం లేదని కాశీకి నూరిపోస్తుంది. ఆ మాటలతో కాశీ మనసు మారిపోయి, తన బాస్‌లకు బుద్ధి చెబుతానని వైరాకు మాటిస్తాడు.

శ్రీధర్ అరెస్ట్.. ఫుడ్ ట్రక్స్ వెనుక భారీ కుట్ర!
మరోవైపు, శ్రీధర్ ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్‌తో మీడియా అంతా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. అందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ శ్రీధర్ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో.. కాశీ పోలీసులతో కలిసి అక్కడికి వస్తాడు. ఫుడ్ ట్రక్ దగ్గర ఆహారం తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారని, అది కల్తీ ఆహారమని పోలీసులు శ్రీధర్‌ను నిలదీస్తారు. శ్రీధర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా, సీఈవోగా బాధ్యత వహించాలంటూ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా చూసిన మీడియా శ్రీధర్‌ను చుట్టుముట్టడంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. కాశీ చేసిన ఈ వెన్నుపోటు శ్రీధర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది.
దీపపై సుమిత్ర మాతృప్రేమ.. అత్తమ్మకు ఏమైంది?
ఇంట్లో దీప పని చేస్తుంటే, సుమిత్ర వచ్చి ఆమెను ఆపుతుంది. కడుపుతో ఉన్నప్పుడు వంగి పని చేయకూడదని, పురిటి గురించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది. "నీకు తల్లి లేదు, పుట్టిల్లు లేదు.. అందుకే ఈ తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలు నేను చెబుతున్నాను" అంటూ సుమిత్ర చూపించిన ప్రేమకు దీప కంటతడి పెడుతుంది. సుమిత్రను తన తల్లిగా భావించి దీప ఎంతో ఆనందిస్తుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు.
రక్తపు వాంతి చేసుకున్న సుమిత్ర.. అసలు నిజం ఏంటి?
ఇల్లు ఊడుస్తున్న సుమిత్ర ఒక్కసారిగా దగ్గుతూ వాష్ రూంలోకి వెళ్తుంది. అక్కడ ఆమె నోటి వెంట రక్తం రావడంతో దీప, దశరథలు షాక్ అవుతారు. సుమిత్రకు ఏమైందని దీప కంగారుగా అడిగితే.. దశరథ ఆ విషయాన్ని దాటవేస్తూ, ఇవన్నీ మర్చిపొమ్మని దీపకు చెబుతాడు. అసలు సుమిత్ర అనారోగ్యం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దశరథ ఆ నిజాన్ని ఎందుకు దాస్తున్నాడు? అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది.
కాశీ వేసిన స్కెచ్‌తో శ్రీధర్ జైలుపాలయ్యాడు. అటు సుమిత్ర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరి కార్తీక్ తన తండ్రిని ఎలా కాపాడతాడు? సుమిత్రకు వచ్చిన జబ్బు ఏంటి? జ్యోత్స్న కుతంత్రాలు ఎప్పటికి బయటపడతాయి? అనే ఆసక్తికర విషయాలు రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే!
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications