Karthika deepam 2 September 9th Episode:కారు ప్రమాదంతో కాశీకి కష్టాలు.. జ్యోత్స్నకు షాకిచ్చిన కార్తీక్!
సెప్టెంబర్ 8వ తేదీన ప్రసారమైన కార్తీకదీపం 457వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఒకసారి రివైండ్ చేసి చూస్తే.. తాళిబొట్టు వివాదంతో దశరథ, సుమిత్రల మధ్య దూరం పెరగడం శివ నారాయణను బాధ పెడుతుంది. దీనికి దీపానే కారణమని జ్యోత్స్న ఆరోపించగా, "మరపు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం" అని శివ నారాయణ ఆమెకు హితబోధ చేస్తాడు. ఈ గొడవలకు ఎలాగైనా ముగింపు పలకాలని కార్తీక్ బాబు నిర్ణయించుకుని, అందుకు ఒక ప్లాన్ చేస్తాడు.
సెప్టెంబర్ 9, ఎపిసోడ్ 458:
కార్ వాషింగ్ కోసం బయటికి వెళ్లిన కార్తీక్‌కు తండ్రి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. శ్రీధర్ ప్రవర్తనపై కోపంగా ఉన్న కార్తీక్, "మీరు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు శివ నారాయణ మిమ్మల్ని మోసం చేసినందుకు కొట్టారు. కానీ అప్పటి నుంచి ఆయనకు నచ్చేలా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా?" అని నిలదీస్తాడు. శ్రీధర్ రెండో పెళ్లిని మినహాయిస్తే అన్ని విషయాల్లో మంచి వాడేనని పేరు తెచ్చుకున్నారా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. మరోవైపు, పారుజాతంతో శ్రీధర్ స్నేహం చేయడంపై కూడా కార్తీక్ మండిపడతాడు.

అదే సమయంలో, కాశీకి జాబ్ పోయిందని మెయిల్ రావడంతో షాక్ అయిన కాశీ, కారును స్కూటర్‌కు ఢీ కొట్టి ప్రమాదానికి గురవుతాడు. మరోపక్క, కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతూ శివ నారాయణను కలుస్తారు. కంపెనీ నష్టాలకు కారణం జ్యోత్స్న అని ఉద్యోగులు చెప్పకుండానే సూచిస్తారు.
వెంటనే ఇంటికి వచ్చిన కార్తీక్ ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని హామీనిస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్నపై మండిపడ్డ శివ నారాయణ, "నువ్వు సీఈఓగా ఉన్నప్పటి నుంచి కంపెనీ నష్టాల్లోనే నడుస్తోంది" అని అంటాడు. జ్యోత్స్న అకౌంట్స్ ఆడిటింగ్ చేయిస్తానని శివ నారాయణ అనడంతో ఆమె భయపడుతుంది. నెల రోజులు గడువు అడిగిన జ్యోత్స్నకు, ఆ తర్వాత సీఈఓ పదవిలో వేరేవారు వస్తారని శివ నారాయణ హెచ్చరిస్తాడు. దీంతో జ్యోత్స్న చేసిన మోసం బయట పడబోతుందని భయపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications