శ్రీలీలకు స్టార్ హీరో క్యూట్ సర్‌ప్రైజ్.. రిలేషన్ వార్తల వేళ స్పెషల్ పోస్ట్!

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్, తన కో-స్టార్, రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ శ్రీలీల 25వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో కార్తీక్ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీలతో కలిసి దిగిన ఓ అందమైన బైక్ సెల్ఫీని షేర్ చేస్తూ ఆయన శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

'శ్రీశీ' అంటూ కార్తీక్ పోస్ట్.. 'స్వీటెస్ట్' అంటూ శ్రీలీల రిప్లై
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పంచుకున్న ఈ ఫోటోలో ఆయన బైక్ నడుపుతుండగా.. శ్రీలీల వెనుక కూర్చొని ఉంది. వీరిద్దరూ బైక్ అద్దంలో చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోకు కార్తీక్ ఆర్యన్.. "హ్యాపీ బర్త్ డే శ్రీశ్రీ" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి శ్రీలీల స్పందిస్తూ.. "థాంక్యూ స్వీటెస్ట్" అని రిప్లై ఇచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Kartik Aaryan Wishes Rumoured Girlfriend Sreeleela on 25th Birthday with a Cute Bike Selfie Details

అనురాగ్ బసు మూవీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల త్వరలోనే ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ రొమాంటిక్ డ్రామాలో కలిసి నటించనున్నారు. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాతోనే శ్రీలీల బాలీవుడ్‌లోకి అధికారికంగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రం 2026 చివరి నాటికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. కార్తీక్ ఆర్యన్ గతంలో సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో అనన్యా పాండే, నీనా గుప్తా, జాకీ ష్రాఫ్, టికు తల్సానియాలతో కలిసి "తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ" అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించారు.

ఫిబ్రవరిలో రానున్న కార్తీక్ 'నాగ్‌జిల్లా'
అనురాగ్ బసు సినిమాతో పాటు కార్తీక్ ఆర్యన్ చేతిలో 'నాగ్‌జిల్లా' అనే కామెడీ-అడ్వెంచర్ చిత్రం ఉంది. 'ఫుక్రే' ఫ్రాంచైజ్ ఫేమ్ మృగ్‌దీప్ సింగ్ లంబా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానుంది. భారతీయ జానపద కథల ఆధారంగా ఇచ్ఛాధారి నాగుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కరణ్ జోహార్, మహావీర్ జైన్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా తదితరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "ఇప్పటివరకు ఎన్నో మానవ కథలను చూశారు, ఇప్పుడు నాగుల కథను చూడండి. నాగ్‌జిల్లా - నాగ్ లోక్ కా పెహ్లా కాండ్" అంటూ కార్తీక్ క్యాప్షన్ ఇచ్చాడు.

వివాదం తర్వాత సైలెంట్‌గా ఉన్న కార్తీక్
గత కొంతకాలంగా కార్తీక్ ఆర్యన్ మీడియాకు కాస్త దూరంగా, సైలెంట్‌గా ఉంటున్నాడు. స్నాప్‌చాట్ యాప్‌లో ఆయన ఓ మైనర్ బాలికతో చాటింగ్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ వివాదం దీనికి కారణం. అయితే కార్తీక్ ఒక మైనర్‌కు టెక్స్ట్ చేశారనే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు మాత్రమే అయినప్పటికీ, దీనిపై వచ్చిన వివాదం కారణంగా ఆయన కాస్త లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+