తన బాయ్‌ఫ్రెండ్‌ను మీడియాకు పరిచయం చేసిన కీర్తిసురేష్
అగ్ర హీరోల సరసన నటిస్తున్నప్పటికీ ఫ్లాప్స్ ఎదురవుతున్న కీర్తి సురేష్ కు టైర్2 హీరోల సరసన మాత్రం బ్లాక్ బస్టర్లు దొరుకుతున్నాయి. మహానటి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కీర్తి ఇటీవలే నాని హీరోగా నటించిన దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సాధించడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే రఘుతాత సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను కొట్టింది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. క్రిస్మస్ రోజు విడుదల కాబోతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ లో ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
లవ్ యూ డార్లింగ్.. హ్యాపీ బర్త్ డే
తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. అనేక పోస్టులు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్.. ఈరోజు తన పుట్టినరోజని, తన పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ నుంచి శుభాకాంక్షలను ఆశిస్తున్నానని, లవ్ యూ డార్లింగ్ అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి ఆమె బదులిచ్చింది. లవ్ యూ టూ డార్లింగ్ హ్యాపీ బర్త్ డే అంటూ తిరిగి సమాధానం ఇచ్చింది. ఇలా తన ప్రేమను, ప్రేమికుడిని పరిచయం చేయడంతో అంతా షాక్ అయ్యారు.

బాలనటిగా కెరీర్ ప్రారంభించింది
నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్ బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఒక జాతీయ చలనచిత్ర అవార్డు , ఐదు సైమా అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకోవడంతోపాటు పలు ప్రశంసలు దక్కించుకుంది. 2021లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో కీర్తి సురేష్ కు స్థానం దక్కింది. దాదాపుగా ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. నేను శైలజ, రెమో, రజనీ మురుగన్, రింగ్ మాస్టర్, ఇదు ఎన్న మాయం తదితర సినిమాల్లో నటించింది. సావిత్రి పాత్ర పోషించి మహానటి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డుతోపాటు జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా దక్కింది. తర్వాత పెంగ్విన్, రంగ్ దే, దసరా తదితర చిత్రాల్లో నటించింది.












Click it and Unblock the Notifications