ఆ హీరోతో కలిసి బెడ్ రూమ్‌లో రెచ్చిపోయిన కీర్తి సురేష్..'మహానటి'కి ఇదో మాయని మచ్చ
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

కీర్తి సురేష్ నితిన్ కలిసి 'రంగ్ దే' అనే సినిమాలో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాతో కీర్తి సురేష్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అప్పటి వరకు రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉన్న కీర్తి సురేష్, ఈ సినిమాలో అలాంటి సీన్లలో నటించింది. ముఖ్యంగా ఓ సాంగ్‌లో బెడ్ రూమ్‌లో నితిన్‌తో రెచ్చిపోయి నటించింది. దీనిపై ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. 'మహానటి' వంటి సినిమా తీసిన కీర్తి సురేష్ ఇలాంటి సీన్లలో నటించడం ఏంటని ఆమెను ప్రశ్నించారు. ఈ సాంగ్ విషయంలో కీర్తి సురేష్ కెరీర్‌లో ఇదో మాయని మచ్చ మాదిరిగా నిలిచింది. నేటితరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది.
కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications