నేను సింగిల్‌గా ఉన్నానని చెప్పానా..? మొత్తానికి రిలేషన్‌పై ఓపెన్ అయిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.కీర్తి సురేష్ , ఓ కమెడియన్‌ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా అనేక కథనాలు వెలిశాయి. కీర్తి సురేష్ పెళ్లిపై వచ్చినవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.
'రఘు తాత' అనే తమిళ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో 'రఘు తాత' సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న కీర్తి , మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'మీరు సింగిల్‌గా ఉంటున్నారా.. బోర్‌గా అనిపించడం లేదా?' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కీర్తి స్పందిస్తూ..'నేను సింగిల్ అని చెప్పలేదుగా' అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

అయితే కీర్తి సరదాగా కామెంట్ చేసిందో లేక నేను రిలేషన్‌లోనే ఉన్నానని పరోక్షంగా చెప్పిందో ఎవరికి అర్థం కాలేదు. పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ..ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ అభిప్రాయపడింది.
ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications