"పువ్వు బాగుండడం ఏంట్రా..?" అభిమానిపై కీర్తి సురేష్ ఫైర్.. వీడియో వైరల్

నటి కీర్తి సురేష్ గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో నేను శైలజ చిత్రంలో పరిచయం అయిన ఈ అమ్మడు టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. నేచురల్ స్టార్ నానితో నేను లోకల్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి, మహానటి, మన్మథుడు 2, జాతి రత్నాలు, రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా, కల్కి లో బుజ్జిగా.. ఇలా అనేక హిట్ సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటిలో సావిత్రి పాత్రలో జీవించి నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. తెలుగులో చివరగా రివాల్వర్ రీటా, ఉప్పుకప్పురంబు సినిమాల్లో నటించి ప్రశంసలు పొందారు కీర్తి సురేష్.

అయితే ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిలిమ్ అవార్డు అందుకున్నారు కీర్తి సురేష్. అవార్డు అందుకోవడానికి వెళ్తున్నప్పుడు ఓ అభిమాని చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చెన్నై లో ఆమె తన కారు ఎక్కుతుండగా ఓ అభిమాని ఆమెని పిలిచి 'మీ పువ్వు చాలా బాగుంది మేడం' అని అంటాడు. దీంతో కీర్తి సురేష్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఓ నిమిషం తేరుకుని 'ఆ..?.. పువ్వు బాగుందా..? ఏమి మాట్లాడుతున్నావ్' అని అన్నారు. అంటే ఆమె నిజంగానే పువ్వు తలకి పెట్టుకున్నారు కానీ.. అతను ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో తెలియక కీర్తి సురేష్ షాక్ కి గురయ్యారు.

KeerthySuresh viral video What About Me to Fan Flower Comment Heartwarming Viral Video Buzz

'నా లుక్ చాలా బాగుంది అనాలి కానీ.. పువ్వు బాగుండడం ఏంట్రా' అంటూ కారు లోపలకు ఎక్కారు. అనంతరం ఆమె తమిళంలో మాట్లాడుతూ 'ఆ పాపి పువ్వు బాగుంది అంటున్నాడు.. ఏమి చెప్పాలి వాడికి' అంటూ తిట్టుకోవడాన్ని వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గతంలోనూ కీర్తి సురేష్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు.. ఇవ్వడానికి రెడీ అయ్యారు కీర్తి సురేష్.. అయితే ఆ అభిమాని ఫోన్ కెమెరా పైకి పెట్టడంతో తన జాకెట్ ను కవర్ చేసుకుంటూ.. క్రిందకు దించి ఫోటో తీసుకోమని అభిమానితో అన్నారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండ తో 'రౌడీ జనార్ధన'చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా అలాగే మలయాళంలో మరో సినిమా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+