ఎవరూ అవునన్న కాదన్న నువ్వే తెలుగు ఇండస్ట్రీకి రారాజు
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. అందరి హీరోలకు అభిమానులుంటారు. కానీ మహేష్ బాబును ఆయన అభిమానులు దేవుడుగా కొలుస్తారు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. మహేష్ 1000 మందికి పైగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ కారణంగానే మహేష్ బాబును దేవుడుతో పోలుస్తుంటారు అభిమానులు. ఇదిలా ఉంటే మహేష్ బాబు అభిమానులు గత కొన్నేళ్లుగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గతేడాది ఆయన నటించిన సూపర్ హిట్ మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ, కలెక్షన్లు విషయంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది.ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. మురారి మూవీకి ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోస్ దర్శనం ఇచ్చాయి. ఈ రేంజ్‌లో రీ రిలీజ్‌ను కూడా సెలబ్రేట్ చేయడం కేవలం మహేష్ బాబు అభిమానులకు చెల్లింది. ఓ జంట అయితే ఏకంగా థియేటర్‌లో పెళ్లి చేసుకున్న వీడియోలు సైతం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రీ రిలీజ్‌ను ఇలా కూడా సెలబ్రేట్ చేయవచ్చా అనే విధంగా మహేష్ బాబు అభిమానులు నిరూపించారు. ఇక కలెక్షన్ల విషయంలో కూడా మురారి సత్తా చాటింది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో మురారి మూవీ..ఏపీ , నైజం లో కలిపి రూ. 2.26 కోట్లు రాబట్టింది. నైజంలో అల్‌టైం రికార్డు మహేష్ బాబు పేరునే ఉంది. పవన్ కల్యాణ్ నటించిన ఖుషి రీరిలీజ్ కలెక్షన్లను మురారి ఒక్క రోజులోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.
ఇప్పటివరకు మహేష్ రీ రిలీజ్ సినిమాలలో బిజినెస్ మ్యాన్ తర్వాత.. మురారి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మురారి మూవీ రీ రిలీజ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఐదున్నర కోట్లకుపైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మురారి మూవీకి ఏపీ, నైజాంలో కలిసి 2.26 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు ఖలేజా సినిమా వంతు వచ్చింది.

'ఖలేజా' సినిమా మే 30న రీ-రిలీజ్కు సిద్ధమైంది. విడుదలై పరాజయం పాలైనప్పుడు చేసిన తప్పును మళ్లీ చేయకూడదని భావిస్తున్న ప్రేక్షకులు, ఈసారి సినిమాను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు.'ఖలేజా' రీ-రిలీజ్ కోసం బుకింగ్స్ కు అనూహ్య స్పందన వస్తోంది. విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే లక్షన్నరకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 2 కోట్లు రాబట్టింది. ప్రస్తుత జోరు చూస్తుంటే, రీ-రిలీజ్ పరంగా 'ఖలేజా' సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. రీ-రిలీజ్‌లో రూ. 10 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి తెలుగు సినిమాగా 'ఖలేజా' నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల కంటే కూడా, థియేటర్లలో 'ఖలేజా'ను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ సినిమాకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.దీనిపై అభిమానులు రియాక్ట్ అవుతూ..తెలుగు ఇండస్ట్రీకి రారాజు నువ్వే అంటే మహేష్ బాబును కీర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications