గుడ్ న్యూస్ చెప్పిన మెగా బ్యూటీ.. అతనితో ఫిక్స్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద 'ఉప్పెన' సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. ఓ రెండేళ్లు వరుస సినిమాలతో అదరగొట్టింది. నితిన్, నాగ చైతన్య, రామ్, నాని, శర్వానంద్ వంటి యంగ్ స్టార్స్‌తో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఆమెకు కొద్దిగా అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో కృతి శెట్టి కాస్తా డల్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఈ భామకు తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తుంది అమ్మడు. ఏఆర్ఎమ్ అనే సినిమాతో ఓ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కృతి శెట్టి తన కొత్త సినిమాను అనౌన్స్ చూసింది. తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌తో ఓ సినిమా చేస్తుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ప్రదీప్ రంగనాథన్‌కు మంచి క్రేజ్ ఉంది. వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ సక్సెస్‌లు కొడుతున్నాడు.లవ్ టూడే, డ్రాగన్ వంటి సినిమాలతో ప్రదీప్ రంగనాథన్‌కు ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో అతను నటించే సినిమాలకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా ప్రదీప్ రంగనాథన్ సినిమా చేయబోతున్నట్టు కృతి శెట్టి ప్రకటించింది. ఈ మూవీని నయనతార భర్త కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాపై కీలక ఆప్డేట్ ఇచ్చింది కృతి. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ ప్రదీప్, విఘ్నేష్‌తో పాటు మూవీ టీమ్ అందరితో కలిసి కనిపించింది.అలాగే మా చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గ మారింది.












Click it and Unblock the Notifications