కుమారి ఆంటీకి బంపర్ ఆఫర్?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదభావాలు తొలగిపోయాయి. కాకపోతే చిన్న తేడా ఏమిటి అంటే.. సెలబ్రిటీలు అనుకున్నవారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. సెలబ్రిటీలుగా మారిన సామాన్యులకు కాస్తంత తక్కువ ఫాలోవర్లు ఉంటారు. ఫాలోవర్ల సంఖ్యలోనే ఎక్కువ తక్కువంటూ తేడాలుంటాయికానీ వారుచేసే పనుల్లోను, తెచ్చుకునే పేరులోను పెద్దగా మార్పుండదు.
హైదరాబాద్ మహానగరంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఎంతో ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేబుల్ బ్రిడ్జివద్ద ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తోన్న ఆమె అందించే ఆహారం చాలా బాగుంటుందని పేరు రావడంతో వినియోగదారులు ఎగబడుతుంటారు.

స్టార్ సెలబ్రిటీలు కూడా ఆమెదగ్గర భోజనం చేస్తుంటారు. అంతేకాదు వారు ఆమెను ఎంతో ప్రోత్సహిస్తుంటారు. తాజాగా చాలామంది ఆమె వ్యాపారాన్ని మూయించాలని ప్రయత్నాలు చేశారుకానీ వీలుకాలేదు. వారి ప్రయత్నాలన్నీ ఆమె అందించే రుచికరమైన ఆహారం ముందు బెడిసికొట్టాయి. తాజాగా ఆమె అక్కడ షాప్ తెరిచింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుమారి ఆంటీని సినిమాల్లో నటించాలని కొందరు కోరుతుండగా మరికొందరు రియాలిటీ షోకు రావాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారంట.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లోకి కుమారి వెళ్లబోతోందంటూ ప్రచారం నడుస్తోంది. బిగ్ బాస్ హౌస్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే చాలామంది ఆమెను బిగ్ బాస్ కు వద్దని సలహా ఇస్తున్నారు. తాను కష్టాన్ని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నానని, ఇలాగే జీవితంలో ముందుకు వెళతానుకానీ తాను అక్కడి రాను అని చెప్పేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications