ఒక్క తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించి రూ.10వేల కోట్లకు వారసురాలైంది

చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి హీరోయిన్ గా అవకాశం సంపాదించేందుకు కష్టపడింది. చిన్న చిన్న ఆల్బమ్స్ చేసింది.. తర్వాత అవకాశాలు వచ్చాయి. పరిశ్రమలో స్థిరపడాలనుకుంది. ఎన్నో ఆల్బమ్స్ నటించింది. తెలుగులో నటించి తర్వాత హిందీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ఆస్తి రూ.10వేల కోట్లు. ఆమె ఎవరో కాదు దివ్య ఖోస్లా కుమార్‌. తెలుగులో లవ్ టుడే సినిమాతో అడుగుపెట్టింది. అందులో ఉదయ్ కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. 2004లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

దివ్య 'లవ్‌టుడే'తర్వాత 'అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, బాబీ డియోల్ సరసన నటించి మెప్పించింది. వాస్తవానికి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కెరీర్ దెబ్బతిందనుకుంటున్న తరుణంలో ఆమె జీవితంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఈ సినిమా సెట్ లో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దివ్యను చూసి ప్రేమలో పడ్డారు. ఇరువైపులా కుటుంబాలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో ఓ బాబు పుట్టాడు. తర్వాత సినిమాలు వదిలేసిన దివ్య 2016లో సనమ్ రే చిత్రంతో మళ్లీ అడుగుపెట్టింది. తాజాగా యానిమల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.

latest bollywood movie animal producer divya khosla kumar biography

ప్రొడ్యూసర్‌గా 8 సినిమాలు తీసింది. ఆమె భర్త భూషణ్ కుమార్ రూ. 10,000 కోట్లతో దేశంలో 175వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి అరుదైన రికార్డును సృష్టించిందని చెప్పొచ్చు. 1987 నవంబరు 20న జన్మించిన దివ్య 2005 ఫిబ్రవరి 13న కత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరంలో భూషణ్ కుమార్ ను వివాహమాడింది. ప్రస్తుతం నిర్మాతగా పలు భారీ ప్రాజెక్టులను సెట్ చేసే పనుల్లో బిజీగా ఉంది. యానిమల్ తో భారీ విజయం సాధించడంతో తర్వాత వీరి బ్యానర్ నుంచి వచ్చే సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+