అమరావతి రైతుల జేఏసీ కీలక నిర్ణయాలు, ఇక నుంచి..!!
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు వేగం అందు కొన్నాయి. ప్రభుత్వం తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు టైం నిర్దేశించింది. రెండో విడత భూ సమీకరణ అమలు చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాల పైన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలోనే అమరావతి రైతుల జేఏసీ సమావేశమై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి రైతుల జేఏసీ సమావేశం లో పలు అంశాలను చర్చించారు. రాజధాని నిర్మాణంతో పాటుగా రైతులకు హామీల అమలు.. రైతుల సమస్యలను ప్రస్తావించారు. అమరావతి పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేసినట్లు జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. కొందరు అధికారులు రైతుల సమస్యల పైన సానుకూలంగా స్పందించటం లేదని ఆవేదన వ్యక్తంచేసారు. గ్రామాల ప్రజల అవసరాలను పట్టించుకోలేదని వాపోతయారు. ఇక, రాజధాని అమరావతి రైతులతో అభివృద్ధి సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల సమస్యలను CRDA కి చెప్పడమే.. కానీ, వాటిని CRDA అధికారులు సరిగా పరిష్కారం చూపించటం లేదని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రభుత్వానికి కీలక సూచనలు
రైతులు ప్రస్తావిస్తున్న అంశాలను నిర్దేశిత సమయం మేరకు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. త్వరలో 29 గ్రామాల ప్రతినిధులతో సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ నుంచి అమరావతి భవిష్యత్ కు సూచనలు.. సలహాలు ఇస్తామని స్పష్టం చేసారు. రైతులకు ఇప్పటి FSI నిబంధనలు వలన నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రకంగా FSI నిబంధనలు అమలు చేస్తున్నారని వివరించారు. రాజధాని అమరావతి లో అభివృద్ధి అంతా ఒకే చోట జరుగుతుందని చెప్పుకొచ్చారు. కౌలు గడువు ముగిశాక రైతులు జీవనోపాధి పెరిగేలా ఉండాలని రైతులు కోరారు. రాజధానిలో అనేక రకాల రైతులు భూములు ఇచ్చారుని.. వారికి ప్లాట్లు సకాలంలో ఇవ్వాలని సూచించారు. రాజధానిలో అనేక కంపెనీలు రావాలని ఆకాంక్షించిన రైతులు.. జేఏసీ ఏర్పాటు చేసే కమిటీ పార్టీలకు అతీతంగా ఉండాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications