సౌందర్యను హత్య చేయించింది ఆ హీరోనే..!
హీరోయిన్ సౌందర్య గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమాని లేరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఈ రెండు కలిసి ఉన్న నటే సౌందర్య. ఈ రెండిటితో పాటు అదృష్టాం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కొ సినిమా చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందింది.
అయితే సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి అని చెప్పాలి. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి సినిమాల్లో సౌందర్యకు ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారామె. తర్వాత తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది.

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఈక్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు. బెంగుళూరు నుండి కరీంనగర్‌కి వెళ్లే క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె బ్రదర్ సైతం మరణించారు.అయితే ఆమె మరణానికి మోహన్ బాబు కారణమంటూ ఓ వ్యక్తి లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
సౌందర్య ఆమె సోదరుడిని మంచు మోహన్ బాబు హత్య చేయించాడని, ఆయనపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు లేఖ రాశాడు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేశారు.అంతేగాక మంచు మోహన్ బాబు ద్వారా తనకు ప్రాణహాని ఉన్నదని, ప్రాణ రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నాడు. సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని చిట్టిబాబు తన లేఖలో పేర్కొన్నాడు. దీంతో కక్ష్య పెంచుకున్న మోహన్ బాబు సౌందర్యతో పాటు, ఆమె సోదరుడు అమర్నాథ్‌ని పక్కా ప్లాన్‌తో హత్య చేయించాడని చిట్టిబాబు ఆరోపించారు.
అంతేగాక మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని,మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకొని గెస్ట్ హౌజ్ ను స్వాధీనం చేసుకోవాలని లేఖ ద్వారా చిట్టిమల్లు కోరారు.జలపల్లిలో మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యది.హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో సౌందర్య భాగా సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ భూమి కొనుగోలు చేసి, భారీ బంగ్లాను కట్టించింది. దీని విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సౌందర్య మరణం తర్వాత ఆ బంగ్లాను తక్కువ ధరకే మోహన్ బాబు కొనుగొలు చేశారు. ఇప్పుడు దీనిపై చిట్టిబాబు అనే వ్యక్తి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications