బాలయ్యబాబు సినిమాలోని డైలాగులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత...
నచ్చావులే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి మాధవీలత. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమా అంత విజయాన్నీ ఏ సినిమా అందించలేకపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే, ఎప్పడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ, ముక్కుసూటిగా మాట్లాడే మాధవీలత సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవారు. అయితే చాలాకాలంగా ఆమె మీడియాకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు తాజాగా మళ్లీ నటి మాధవిలత యాక్టివ్ అయ్యారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గతంలో మాదిరిగానే ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. అయితే, ఈక్రమంలో ఆమె బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలపై కామెంట్లు చేశారు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
చేసేది శివపూజలు దూరేది ఇంకేక్కడో : తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవీలత ఇలా మాట్లాడారు. ఆదిపురుష్ సినిమా ఒక బ్లండర్, డిజాస్టర్, డర్టీ చిత్రం. హిందువులని డివైడ్ చేయడానికే ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదిపురుష్ సినిమాను నేను రీసెంట్ గానే చూశాను అని మాధవి లతా పేర్కొన్నారు. ఇక బాలయ్య రీసెంట్ మూవీ భగవంత కేసరిపై కూడా మాధవీలత చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం చాలా మంచి విషయం. కానీ, హీరోయిన్ పాత్రని గ్లామర్ కి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగులు చెప్పిస్తే మాత్రం.. చేసేది శివ పూజలు దూరేది ఇంకేక్కడో అన్నట్టు ఉంటుంది.

అలా కాకుండా హీరోయిన్ పాత్ర కూడా గౌరవంగా ఉంటే బాగుంటుంది. కానీ భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల పాత్ర చాలా బావుంటుందని నేను విన్నాను. సినిమాలో డైలాగులు చెప్పడం వరకే కాదు.. చెప్పేవారు రియల్ లైఫ్‌లో కూడా అలాంటివి ఫాలో అయితే బాగుంటుంది అంటూ మాధవీలత అలా చేయకపోతే చేసేది శివపూజలు దూరేది ఇంకేదో అన్నట్లుగా ఉంటుందని మాధవీలత పేర్కొంది.












Click it and Unblock the Notifications