ఇళ్లు, కారు, బంగారం సహా అన్నీ అమ్మి 40 కోట్లతో సినిమా.. కానీ చివరికి !

సినిమా తీయాలనే సంకల్పంతో.. ఉన్న ఇళ్లు, కారు, బంగారం సహా అన్నీ అమ్మి.. భార్య జాబ్ చేసి పోగు చేసిన డబ్బులను కూడా వాడేసి.. అప్పులు చేసి తానే నిర్మాణంలో భాగమయ్యి 40 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కించారు. ఒక వైపు దర్శకుడిగా .. మరోవైపు నిర్మాణంలో ఇలా ఆ చిత్రాన్ని తన భుజాలకి ఎత్తుకున్నాడు. చివరికి ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తానికి సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. స్టార్ నటీనటులు లేరు.. నార్మల్ మూవీ కాదు అయినా కానీ రికార్డులు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. 30 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఇంత చెప్పాక ఆ సినిమా ఏంటో అర్దం అయ్యే ఉంటుంది. అదే రికార్డులు తిరగరాస్తున్న 'మహావతార్ నరసింహ' మూవీ. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ సుమారు రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయేమో.. ఇండియాలో కష్టమే అనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది.

mahavathar-narasimha-movie-director-aswin-kumar-opens-on-financial-struggles

ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఏ సినిమాని ఆదరిస్తారు ? ఏ చిత్రాన్ని ఛీ కొడతారు అని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. మూవీలో కాన్సెప్ట్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మరోసారి నిరూపించారు. అది యానిమేషన్ లో వస్తుందా? లేదంటే నార్మల్ సినిమాగా వస్తుందా అనే విషయాన్ని సైతం పక్కన పెట్టి ఆదరణ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఈ సినిమా అని చెప్పొచ్చు.

300 కోట్ల కలెక్షన్స్..

40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని హోంబలే అధికారికంగా ప్రకటించింది. 300 కోట్ల రూపాయల బెంచ్‌మార్క్‌ను చేరుకున్న తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి పడిన ఇబ్బందుల గురించి డైరెక్టర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.

దేవుడు మీద నమ్మకం లేదు..

అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. నిజానికి తనకు దేవుడి మీద నమ్మకం అయితే లేదని.. ఒకరు సంతోషంగా, మరొకరు దుఃఖంతో ఎందుకుంటారు. ఈ దేవుడు అనే వారు ఎవరూ లేరని కావాలనే కొంతమంది వాళ్ళు ఉన్నట్టు సృష్టించారని అనుకునేవాడినని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరికొంతమందితో మూర్ఖంగా వాదించే వాడినని కూడా తెలిపారు. కానీ భగవద్గీత చదివిన తర్వాత దేవుడు అనేవాడు ఏ రూపంలో అయినా వచ్చి మనుషులకు సాయం చేస్తాడు అనే ఒక భావాన్ని నమ్మానని వెల్లడించారు. అందువల్లే భక్త ప్రహ్లాదుని కథ ను యానిమేటెడ్ గా తీయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు.

అన్నీ అమ్మి సినిమా..

ఈ విషయాన్ని తన భార్య శిల్పతో చెప్పినట్టు వివరించారు అశ్విన్. పెళ్లికి ముందు తన భార్య లండన్ లో జాబ్ చేసినపుడు పోగేసిన డబ్బులతో ఈ సినిమాను స్టార్ట్ చేశామని.. కానీ సినిమా అనుకున్నంత ఈజీగా అవ్వదని తర్వాత అర్ధం అయ్యిందని చెప్పారు. తమ ఇల్లు, కారు, నగలు మొత్తం అన్ని అమ్మి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టామన్నారు. అయినప్పటికి ఇంకా ఆ సినిమా పూర్తకపోవడంతో కొంతమంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు తీసుకువచ్చి మరి ఈ సినిమాను పూర్తి చేశామని అన్నారు. మేము పెట్టిన 40 కోట్ల బడ్జెట్ వస్తే ముందు అప్పులన్నీ తీరుతాయని అనుకున్నామన్నారు.

కానీ అవుట్ పుట్ మాత్రం బాగా రావడంతో సినిమా మీద ఎక్కడో ఒకచోట మంచి ఒక కాన్ఫిడట్ అయితే వచ్చింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తోండడంతో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి మహావతార్ నరసింహ మూవీ భవిష్యత్తులో యానిమేషన్ సినిమాలకు కొత్త దారి చూపిందని హర్షం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+