ఓటీటీలోకి టాలీవుడ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి

తెలుగులో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ భారీగానే ఉంది. డివోషనల్ ప్లస్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇటీవల వచ్చిన మాస్ మహారాజ రవితేజ ఇరుముడి సినిమా ఇదే జానర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మహేంద్రగిరి వారాహి' మూవీకూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొత్త కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. ఒక రాజ వంశాన్ని వందల ఏళ్లుగా వెంటాడుతున్న ఓ వింత శాపం.. ఆ కుటుంబంలోని మగవాళ్లు 33 ఏళ్లు దాటగానే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంటారు. అయితే అసలు ఈ శాపం ఎందుకు వచ్చింది..? దాని వెనుక మహేంద్రగిరి వారాహి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి..? ఇలాంటి ప్రశ్నల చుట్టూనే కథ నడుస్తుంది. వినూత్నమైన స్టోరీ కావడంతో ప్రేక్షకులను మెప్పించింది.

అయితే 'మహేంద్రగిరి వారాహి' మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 2 న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇక ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే సినిమాను చూసే అవకాశం ఉంది. ఇక మహేంద్రగిరి వారాహి మూవీ కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్(సుమంత్) ఓ యూట్యూబర్.. తన అన్నయ్య రాజీవ్‌ పెళ్లి నేపథ్యంలో కుటుంబంతో కలిసి మహేంద్రగిరి ఆలయానికి వెళ్తాడు. అయితే అక్కడ అనుకోకుండా తన అన్నతో పాటు రాజవంశీయుడు ఎద్దు దాడిలో మరణిస్తారు. అదే సమయంలో సిద్ధార్థ్ కు దాదాపు 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మహేంద్రగిరి ఆలయం గురించి కీలక విషయాలు తెలుస్తాయి.

MahendragiriVarahi Latest mythological crime thriller arrives on OTT streaming starts October 2

ఈ క్రమంలో గ్రామంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో తన అన్న చావుతో పాటు గ్రామంలో వరుస మరణాలపై సిద్ధార్థ్ స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మూవీలో వందల ఏళ్ల నాటి మహేంద్రగిరి ఆలయం, వారాహి అమ్మవారి శక్తి, రాజవంశానికి చెందిన గతం, ఎవరూ ఊహించని విధంగా వరుస మరణాలు.. ఇలా వీటి మధ్య నడిచే డ్రామా రక్తి కట్టిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+