మహేష్ బాబు, పవన్ కల్యాణ్ కు సాటివచ్చేవారు ఏరి??
ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్... వీరిద్దరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఒక్కోసినిమాకు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా విడుదలయ్యే పాన్ ఇండియా చిత్రాల్లో నటించే హీరోలు కూడా ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడంలేదు. కానీ ఇక్కడ వారికున్న మార్కెట్ ను బట్టి వాళ్లు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఈ ఇద్దరు హీరోలు ఆసక్తిగా లేరు. కానీ ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలను పాన్ ఇండియా సినిమా స్థాయిలో విడుదల చేస్తే కనీసం రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఇద్దరు అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆ దిశగా ఏ నిర్మాత, ఏ దర్శకుడు ప్రయత్నం చేయలేదు.

పవన్ కల్యాణ్, మహేష్ బాబు ప్రస్తుతం వారి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వారు చేస్తున్న ప్రాజెక్టులపై ప్రేక్షకులతో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీని నిర్వహిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు పవన్. ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడానికి త్వరత్వరగా ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తిచేస్తున్నారు.
మహేష్ బాబు గుంటూరు కారంతోపాటు రాజమౌళి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న గుంటూరు కారం సినిమా పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. అనివార్య కారణాలవల్ల ఈ సినిమా నుంచి కొందరు నటులతోపాటు సాంకేతిక నిపుణులు కూడా తప్పుకున్నారు. ఆయా స్థానాల్లో కొత్తవారిని తీసుకొని సినిమా షూటింగ్ ను జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications