మహేష్ బాబు - సౌందర్య కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్
దివంగత నటి సౌందర్య గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ కట్టు, బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించడమేకాదు.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రమాదవశాత్తూ మరణించడం అందరి గుండెలను కలచివేసింది. రాజకీయంగా ఓ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తెలుగు పరిశ్రమలో ఎంతోమంది ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు - సౌందర్య కాంబినేషన్లో గతంలో బ్లాక్ బాస్టర్ మూవీ రావాల్సి ఉంది. మహేష్ బాబు తన రెండో సినిమా యువరాజులో సిమ్రాన్, సాక్షి శివానంద్ లను సరసన నటించాడు. అయితే ముందుగా సిమ్రాన్ స్థానంలో డైరెక్టర్ సౌందర్యను అనుకున్నారు. సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్దది కావడంతో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో డైరెక్టర్ సౌందర్యకు బదులుగా సిమ్రాన్ ను ఎంపిక చేశారు.
మహేష్ బాబుతో సినిమా అనగానే సౌందర్య చాలా సంతోషించిందట. అయితే ఫొటో షూట్ తర్వాత ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడం లేదు.. ఏ యాంగిల్ లో చూసినా ప్రిన్స్ కు అక్కలా కనపడుతోంది. డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి సౌందర్య స్వయంగా ఈ మాట చెప్పి తనకన్నా సిమ్రాన్ అయితే పర్ ఫెక్ట్ గా ఉంటుందని, ఆమెకు కథను వినిపించమని సూచించిందట. లేదంటే మహేష్ బాబు - సౌందర్య జోడీని తెలుగువారు చూసేవారే.












Click it and Unblock the Notifications