మహేష్ దెబ్బకు యూట్యూబ్ షేక్..సలార్ రికార్డు బద్దలు
సూపర్ స్టార్ మహేష్ బాబు యూట్యాబ్‌ను షేక్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమే గుంటూరు కారం. గతంలో వీరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తరువాత త్రివిక్రమ్ - మహేష్ బాబు చేతులు కలపడంతో గుంటూరు కారంపై భారీగా అంచనాలుఏర్పడ్డాయి.
సంక్రాంతి కానుకుగా వస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కేవలం 12 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఈ ట్రైలర్..కేవలం 15 నిమిషాల్లోనే 100k లైక్స్ కొట్టి అరాచకం సృష్టించింది.

అతి తక్కువ కాలంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా గుంటూరు కారం రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ సాధించిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..ఆకలి మీద ఉన్న మహేష్ అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి.
కమర్షియల్ హంగులతో ట్రైలర్‌ని రూపొందించారు మహేష్‌ను ఫుల్ మాస్‌గా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్‌ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మహేష్ బాబు డైలాగ్స్, కామెడీ టైమింగ్ , క్యారెక్టరైజేషన్ అదిరిపోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ట్రైలర్ సూపర్‌గా ఉండటంతో సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ దెబ్బతో సంక్రాంతి విన్నర్ మహేష్ బాబు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు సూపర్బ్ రెస్పన్స్ వచ్చింది.ముఖ్యంగా కూర్చీ మడత పెట్టి సాంగ్‌కు ఊహించని స్పందన లభిస్తోంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications