బాలయ్య అడిగినా బ్రాహ్మణిని పెళ్లి చేసుకోనన్న మహేష్ బాబు?

తెలుగు సినీ పరిశ్రమలో వివాద రహితుడు, అజాత శత్రువు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు అని. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా అవతరించాడు. అభిమానుల బలం ఎక్కువగా ఉంది. చక్కని రూపంతోపాటు మంచి సుగుణాలున్న మహేష్ బాబును అల్లుడిని చేసుకోవాలని నందమూరి బాలకృష్ణ భావించారు. 1999లో పరిశ్రమలోకి మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

మహేష్ బాబు మూడో చిత్రం వంశీ. దీనికి బి.గోపాల్ దర్శకుడు. ఇందులో ప్రిన్స్ సరసన నమత్ర శిరోద్కర్ నటించింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు-నమత్ర ప్రేమలో పడ్డారు. ఐదు సంవత్సరాలు రహస్యంగా ప్రేమను దాచిపెట్టారు. చివరకు 2005లో నిరాడంబరంగా సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.

mahesh babu rejected balakrishna daughter brahmani

నమ్రతను మహేష్ పెళ్లాడటం కృష్ణకు ఇష్టం లేదంటూ ప్రచారం జరిగింది. నమ్రతను వివాహం చేసుకోవడానికి ముందే మహేష్ కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. హీరో బాలకృష్ణ తన పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. నమత్రను ప్రేమించడంవల్ల బాలయ్య ప్రపోజల్ ని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత బాలయ్య తన మేనల్లుడు నారా లోకేష్ కి బ్రాహ్మణిని ఇచ్చి 2007లో వివాహం చేశాడు.

బాలయ్య మహేష్ ని అల్లుడు చేసుకోవాలని అనుకున్నాడన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదుకానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారింది. మరోవైపు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనిపై చిత్ర నిర్మాత డాక్టర్ కె.ఎల్.నారాయణ స్పష్టతనిచ్చారు. దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దనున్న ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లుగా నిర్ణయించారు. అవసరమైతే మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+