నిర్మాతలను బతికించేందుకు మహేష్‌బాబు సంచలన నిర్ణయం
సినీ పరిశ్రమ అన్న తర్వాత నిర్మాతకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ ఆవిర్భావంలో నిర్మాత, దర్శకులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వారు వస్తున్నారంటే సెట్ లో ఉన్న హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటులు, సాంకేతిక నిపుణులందర లేచి నిలబడేవారు. అంతటి గౌరవం ఇచ్చేవారు. ఎందుకంటే నిర్మాత లేనిదే సినిమా తీయలేదు. ప్రతి రూపాయి అతనివ్వాల్సిందే. సినిమా మొత్తం పూర్తయి కాపీ బయటకువచ్చి థియేటర్ కు వెళ్లేంతవరకు అన్ని ఖర్చులు నిర్మాతవే. కాబట్టే నిర్మాతకు అంత విలువిచ్చేవారు. కానీ క్రమేణా నిర్మాతకు గౌరవం ఇవ్వడం మానేసి హీరోకు గౌరవం ఇవ్వడం ప్రారంభించారు.
నిర్మాతలు తగ్గిపోతున్నారు
అదేంటని ప్రశ్నిస్తే హీరోలకున్న అభిమానులవల్లే మనకు రూపాయి వస్తుందని, వారంతా థియేటర్ కు తరలివస్తేనే మనకు లాభాలొస్తాయంటూ నిర్మాతలు కూడా సర్దుకుపోయేవారు. అయితే ప్రస్తుత తరుణంలో నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దశాబ్దాలుగా సినీ నిర్మాణంలో ఉన్నవారు కూడా సినిమాలు తీయడం మానేసి తమ చేతిలో ఉన్న థియేటర్ల వ్యాపారాన్ని చూసుకోవడంతోపాటు ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీనివల్ల సినీ రంగంలో నిర్మాతల కొరత ఏర్పడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమాకు వందల కోట్లరూపాయల పారితోషికం తీసుకోకుండా సినిమా విడుదలై తర్వాత విజయం సాధించి లాభాలు వస్తే అందులో నుంచి 35 శాతం మాత్రం తనకివ్వమని నిర్మాతలకు చెబుతున్నారు.

కృష్ణ బాటలో పయనిస్తున్న మహేష్ బాబు
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు తన పారితోషికాన్ని అలాగే తీసుకుంటున్నారు. దీనివల్ల నిర్మాత చాలా సురక్షితంగ ఉన్నట్లు లెక్క. సినిమా విజయం సాధించకపోయినా ఎంతో కొంత ఇస్తారు. వందల కోట్లరూపాయలైతే ఇవ్వలేరు. అదే సినిమా మంచి హిట్ అయితే పారితోషికం బదులు35 శాతం వాటా అన్నా బ్రహ్మాండమైన సంపాదన వస్తుంది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకునేవారుకాదు.. ఒత్తిడిచేసేవారు కాదు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ డబ్బును నిర్మాతకు తిరిగిచ్చేయడమే కాకుండా తర్వాత అతనికి మరో సినిమా చేయడానికి కాల్‌షీట్లను కూడా ఇచ్చేవారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదేబాటలో పయనిస్తుండటంతో తనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.












Click it and Unblock the Notifications