మహేష్ బాబు - సుకుమార్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్లు
తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా రేంజ్ తో, అదే రేంజ్ ఇమేజ్ తో కొనసాగుతున్న కథానాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది.. సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. తన సినిమాలు విడుదలై ప్రేక్షకులకు నచ్చకపోయినప్పటికీ మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ కారణంగా వసూళ్ల వర్షం కురిపించి ఫ్లాప్ సినిమాలను, యావరేజ్ సినిమాలను హిట్ చేయించిన ఘనత కచ్చితంగా ప్రిన్స్ దే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఒప్పుకుంటాయి. అటువంటి మహేష్ బాబు నుంచి ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమా కూడా మొదటిరోజు మొదటిఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
అయినప్పటికీ ఆ సినిమా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ స్థాయి ఇమేజ్ ఉన్న ప్రిన్స్ తో సినిమా చేయాలని ప్రతి అగ్ర దర్శకుడు తహతహలాడుతుంటాడు. మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమా తీశారు. అది పూర్తిగా నిరాశ పరిచింది. అంతకుముందే అల్లు అర్జున్ తో తీసిన ఆర్య సినిమాను మొదటిగా మహేష్ బాబుకే సుకుమార్ చెప్పారు. అయితే వన్ సైడ్ లవ్ అనే కారణంతో తను ఆ సినిమాను తిరస్కరించారు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

రామ్ చరణ్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన రంగస్థలం కథ కూడా సుకుమార్ ముందుగా ప్రిన్స్ కే చెప్పారు. అయితే దాన్ని కూడా తను తిరస్కరించారు. అదీ అంతే.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా పుష్ప సినిమాను కూడా ప్రిన్స్ కే వినిపించినప్పటికీ అంత మాస్ కథ వద్దని అల్లు అర్జున్ పేరును సూచించారు. అది సూపర్ హిట్ గా నిలిచి పుష్ప2 అందించబోతోంది. ఈ మూడు సినిమాలను మహేష్ బాబు చేసుంటే ఇంకోరకంగా ఉండేదని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే మహేష్ బాబు సాఫ్ట్ గా ఉండటంతో అందుకు తగ్గ కథను సిద్ధం చేయాలని సుకుమార్ ను ప్రిన్స్ అభిమానులు కోరుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం, పుష్ప తరహాలో ఎంతో సహజంగా ఉండే చిత్రం వస్తే రికార్డులు బద్ధలు కావడం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications