'ప్రభాస్' ను దెబ్బతీస్తున్న మైత్రీ, దిల్ రాజు వైరం?

డిసెంబరు 22వ తేదీన డార్లింగ్ ప్రభాస్ చిత్రం సలార్ విడుదల కాబోతోంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ పేరుతో విడుదలవుతోంది. నైజాంలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నప్పటికీ దీనికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నైజాంలో దిల్ రాజు టాప్ డిస్ట్రిబ్యూటర్. మైత్రీ మూవీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి నైజాంలో కార్యాలయాన్ని ప్రారంభించింది. సలార్ చిత్రానికి సంబంధించిన హక్కులను మైత్రీ మూవీస్ సొంతం చేసుకుంది. దిల్ రాజు తక్కువకు అడుగుతున్నాడన్న ఉద్దేశంతో నిర్మాతలు మైత్రీవైపు మొగ్గుచూపించారు. రూ.65 కోట్లు చెల్లించి నైజాం మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు.

Maithri movie makers and Dil Raju feud damaging prabhas salaar

ప్రభాస్ సినిమా.. అందులోను సలార్ పై విపరీతమైన అంచనాలున్నాయి. ఎన్ని థియేటర్లలో విడుదల చేసుకుంటే అంత ఈజీగా కలెక్షన్స్ రాబట్టొచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు అగ్ర సినిమాలు వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిని మైత్రీ మూవీస్ సొంతంగా విడుదల చేసుకుంది. నైజాం మార్కెట్ పై వారికి మంచి గ్రిప్ వచ్చింది. టికెట్ రేట్లు పెంచుకోవడంతోపాటు అదనపు షోలకు కూడా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంది. దిల్ రాజుకు, మైత్రీ మూవీస్ కు డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది.

ప్రస్తుతం యానిమల్, హాయ్ నాన్న సినిమాలను నైజాంలో దిల్ రాజు విడుదల చేశాడు. షారుఖ్ డంకీని కూడా విడుదల చేస్తారంటున్నారు. మరోవైపు హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ కూడా సలార్ కు తలనొప్పిగా మారింది. ఈ మూడు సినిమాలతోపాటు డంకీ కూడా విడుదలైతే సలార్ కు అనుకున్నంత స్థాయిలో థియేటర్లు దొరికే పరిస్థితి కనపడటంలేదు. దీన్ని మైత్రీవారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇటీవలే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను కొనుగోలు చేసి నైజాంలో రూ.10 కోట్లు నష్టపోయారు. దీంతో వీళ్లకు కూడా సలార్ విజయం సాధించడం అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+