ఓల్డేజ్ హోమ్‌లో మ‌ర‌ణించిన మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు..

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు మలయాళ చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించిన‌ దర్శకుడు కేజీ జార్జ్ మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ త‌ట్టుకోలేక‌పోతుంది. మలయాళ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన గ్రేట్‌ డైరెక్టర్‌ కేజీ జార్జ్ (77) ఆదివారం మ‌ర‌ణించారు. ఆయన ఎక్కువగా మమ్ముట్టి, సుకుమారన్‌, శారదల వంటి వారితో సినిమాలు చేశారు. అనారోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు మ‌ల‌యాళ మీడియా వ‌ర్గాలు వెళ్ల‌డించాయి. దుర‌దృష్టం ఏంట‌టే, ఆయ‌న కక్క‌నాడ్‌లోని ఓల్డెజ్ హోమ్‌లో మ‌ర‌ణించారు. ఎన్నో మంచి మంచి సినిమాలు, గొప్ప‌సినిమాలు చేసిన ఆయ‌న ఇలా ఓల్డేజ్‌ హోమ్‌లో చ‌నిపోవ‌డంతో మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ త‌ట్టుకోలేపోతుంది. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువ‌గా కుటుంబ అనుబంధాల గురించే ఉంటాయి. 1972లో మాయ అనే చిత్రంతో ఆయన అసోసియేట్‌ డైరెక్టర్‌గా త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో గొప్ప సినిమాలు అభిమానుల‌కు అందించారు. ఆయ‌న మర‌ణం మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర శోక‌సంద్రాని మిగిల్చింది.

ఆయ‌న గురించి..:ఆయ‌న 1945 మే 24న కేర‌ళ‌లో జ‌న్మించారు. ఆయ‌న బాల్యం, చ‌దువు అంతా అక్క‌డే పూర్త‌య్యాయి. పొలిటికల్‌ సైన్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫిల్మ్ డైరెక్టింగ్‌ చేశారు. అలా సినిమాల్లోకి ప్ర‌వేశించారు. కేజీ జార్జ్ మరణం పట్ల మాలీవుడ్‌ సంతాపం తెలియజేస్తుంది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ ఆయ‌న సినిమాలతో గుర్తిండిపోతారని కొనియాడుతూ నివాళులు అర్పించారు. కేవ‌లం ద‌ర్శ‌కుడిగా మాత్రమే కాకుండా ఆయ‌న ఫౌండర్‌, ఛైర్మెన్‌గా కూడా వ్యవహరించారు.

Malayalam director who died in oldage home..

ఎన్నో అవార్డులు సొంతం..:ఆయన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్నో చిత్రాలకు కేరళ స్టేట్‌ అవార్డులు కూడా వరించాయి. అంత‌టితో ఆగ‌కుండా విశేష ప్రశంలందుకున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసిన దర్శకుడిగా ఆయ‌న పేరుతెచ్చుకున్నారు. అంతేకాదండోయ్‌! చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఆయ‌న ఎంత‌గానో కృషిచేశారు. మలయాళం సినీ టెక్నీషియన్స అసోసియేషన్‌ని స్థాపించడంలో ప్ర‌ముఖ పాత్ర ఆయ‌నదే.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా..:మాయ చిత్రం త‌ర్వాత నీలు సినిమాతో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఈ సినిమాకే ఆయ‌నే స్క్రీన్‌ప్లే అందించారు. 1976లో వచ్చిన స్వప్నదానం చిత్రంతో ఆయన దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. దాదాపు 20కి పైగా సినిమాల‌నే నిర్మించారు. అందులో మమ్ముట్టి నటించిన మేళ, యవనిక, కథక్కు పిన్నిల్, మట్టోరల్‌ చిత్రాలు నిర్మించారు.

Malayalam director who died in oldage home..

ఎన్నో చిత్రాల‌ను నిర్మించారు..:వీటితోపాటు ఐలవంకోట్‌ దేశం, పంచవాడి పాలం, ఇరకల్‌, ఆడామింటే వారియెల్లే, లెఖయుడ్‌ మరణం వంటి చిత్రాలెన్నింటినో కూడా రూపొందించారు. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాదు, మహిళా సాధికారత, సమాజంలో అణచివేత, దోపిడి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. పలు పొలిటికల్‌ డ్రామాలను, కాంట్రవర్షియల్‌ మూవీస్‌ని కూడా రూపొందించారు. అందుకే కేజీ జార్జ్‌ను మలయాళ చిత్ర పరిశ్రమ ఓ పెద్దగా భావిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+