అన్న అలా చేస్తారనుకోలేదు.. కన్నప్పపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నేడు భారీగా రిలీజ్ అయిన చిత్రం " కన్నప్ప ". ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు.
'కన్నప్ప'కు ప్రీమియర్స్ నుంచే మంచి రివ్యూలు వస్తున్నాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. కీలకమైన 40 నిమిషాల ఎపిసోడ్‌లో ప్రభాస్ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ప్రభాస్ చెప్పిన "పెళ్లి" డైలాగ్‌కు థియేటర్లలో నవ్వులు పూశాయి. క్లైమాక్స్‌లో శివుడికి తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశంలో మంచు విష్ణు నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది. ఇక మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుతమైన నటనను కనబరిచారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా చక్కగా నటించింది.

మంచు ఫ్యామిలీలో విభేదాలు కారణంగా కుటుంబ పంచాయతీ రోడ్డుకెక్కింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇష్యూ గొడవలు, కేసులతో మొదలై.. డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది. రీసెంట్ గా రక్తం పంచుకొని పుట్టినవాళ్లే తన పతనాన్ని కోరుకుంటున్నారని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్ గా మనోజ్ భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ.. కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు. కట్టె కాలేవరకు తాను మోహన్ బాబు కొడుకునేనని అన్నారు. అంతే కాకుండా శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని సెటైర్లు వేశారు. ఆ తర్వాత అలా అన్నందుకు క్షమాపణలు కూడా చెప్పారు.
కానీ ఆ తర్వాత మంచు మనోజ్ తన వైఖరి మార్చుకున్నారు. సినిమా రిలీజ్ కి ముందు విష్ణు పేరు ఎక్కడ మెన్షన్ చేయకుండా మవవవీ టీంకి విషెడ్ తెలియజేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా మూవీ చూసి రివ్యూ కూడా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.
కన్నప్ప #KannappaMovie లో విష్ణు బాగా యాక్ట్ చేశారు: మంచు మనోజ్ #TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/W7zSLLFQaD
— sivazee (@sivazeestudio) June 27, 2025
అంతే కాకుండా సినిమా చాలా బాగుందని.. తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందన్నారు. చివరి 20 నిమిషాలు అదిరిపోయిందని.. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుందని చెప్పారు. ప్రభాస్ యాక్టింగ్ అదిరింది అని.. అన్న కూడా ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదని ప్రశంసలు కురిపించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు. తన తండ్రి మోహన్‌బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఈ కామెంట్స్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications