దిష్టి పోయింది బాబాయ్! అల్లు అర్జున్‌పై మంచు మనోజ్
సంధ్య థియేటర్ తొక్కసలాట ఘటన కేసులో అరెస్టయిన సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) బెయిల్‌పై శనివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పుష్ప-2 భారీ విజయంతో వచ్చిన దిష్టి పోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్. వెల్‌కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతాయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని మీరు ఇచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది' అని మనోజ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నిజంగా హృదయ విదారకం. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. మీ కుటుంబానికి మరింత శాంతి, సంతోషాలు కలగాలని అభిలాషిస్తున్నా అంటూ తన ట్వీట్ ముగించారు మంచు మనోజ్.
సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టై.. శనివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అయితే, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ పేపర్లు సరైన సమయంలో చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగాలేకపోవడంతో ఆయన శుక్రవారం అర్ధరాత్రి వరకు జైలులోనే ఉన్నారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి.
అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు.దీంతో అక్కడ కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. అక్కడ కూడా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు.
సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, దిల్ రాజు, వెంకటేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, రానా, శర్వానంద్, అఖిల్, సుధీర్ బాబు, అడవీ శేష్, ఉపేంద్ర, సుధీర్, రాజశేఖర్, జీవితా, తమన్ తదితరులు అల్లు అర్జున్ ను కలిసినవారిలో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీనటుడు ప్రభాస్ ఫోన్ చేసి మాట్లాడారు.












Click it and Unblock the Notifications