క్షమించండి.. అభిమానులకు షాక్ ఇచ్చిన మంచు విష్ణు
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్, శరత్ కుమార్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు మంచు భారీ షాక్ ఇచ్చారు. ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమమైన ఎక్స్ ద్వారా తన సందేశాన్ని షేర్ చేశారు.

VFX ఆలస్యం కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు క్షమించాలని మన్నించాలని కోరారు. "కన్నప్ప జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఓ అద్భుతమైన జర్నీగా సాగింది. అత్యంత సినిమాటిక్ అనుభూతి కలిగించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అందువల్ల VFX ఆలస్యం అవుతోంది. ఈ కారణంగా సినిమా వాయిదా పడింది. దయచేసి క్షమించండి. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అని మంచు విష్ణు ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.
ఇక కన్నప్ప చిత్రంలో అధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అందుకు గల కారణాన్ని గతంలో చిత్రబృందం తెలిపింది. ఈ చిత్ర కథ మూడో శతాబ్ద కాలం నాటిదని.. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో చిత్రీకరణను చేపట్టామని స్పష్టం చేసింది. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, బ్రహ్మానందం, మోహన్ బాబు, ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ ఈ చిత్రానికి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025












Click it and Unblock the Notifications