ఏపీ ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షిచౌదరి..?
సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం ఫుల్ జోహ లో దూసుకుపోతుంది. రవితేజకి జోడిగా నటించిన ఖిలాడీ డిజాస్టర్ కాగా.. అడివి శేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మహేష్ సరసన గుంటూరు కారంలో నటించి అలరించింది. ఇక గతేడాది చివర్లో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమాలున్నాయి.
అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని నియమించారంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వ్యవహారం పైనే డిస్కషన్ నడుస్తోంది. తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.

మీనాక్షి చౌదరిని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అది ఫేక్ అని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.… pic.twitter.com/96uI4Xb0Zr
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 2, 2025
హర్యానా రాష్ట్రంలోని పంచకులలో 1997 ఫిబ్రవరి 1 నాడు పుట్టింది మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి.. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. అలానే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications