అల్లు అర్జున్‌కు బండ్ల గణేష్ కౌంటర్...? మనంత ఎర్రి.. అంటూ
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్‌పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.

పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పవన్‌కు కౌంటరిచ్చారు అల్లు అర్జున్.
నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్‌ను టార్గెట్ చూసుకుని పవన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వివాదాలు చాలదన్నట్టు తాజాగా బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఈ వివాదానికి దగ్గరగా ఉండటంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌పై మరోసారి విమర్శలకు దిగుతున్నారు. గబ్బర్ సింగ్ రీరీలిజ్ ఈవెంట్ నిర్వహించారు.
Evarno anaadu 🫣 pic.twitter.com/J4C7LadLaT
— ustad (@ustadkalyan) August 31, 2024
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక రేవంత్ రెడ్డి.. ఒక చంద్రబాబు నాయుడు.. ఒక మోదీ.. ఇలా వీరంతా లిమిటెడ్ ఎడిషన్..అలాంటి వారిని మనం పూజించాలి.. గౌరవించాలి.. ఆరాధించాలి.. అంతే కానీ వాళ్లు కూడా మనలానే అనుకుంటే.. మనంత ఎర్రి.. అంటూ అక్కడితే ఆపేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications