పెరిగిన రెమ్యునరేషన్.. రామ్ చరణ్‌పై నిర్మాతల ఆగ్రహం?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ను పూర్తిచేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న తన 16వ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా వచ్చిన ధనుష్ రాయన్ చిత్రానికి రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉండటంతో అభిమానులంతా అంచనాలు పెంచేసుకున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమా తర్వాత తన 17వ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. 16వ సినిమాకన్నా 17వ సినిమామీదే మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలే తమిళనాడులోని వేల్స్ విశ్విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా మారిపోయారు. అప్పటివరకు చెర్రీ పారితోషికం సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్ల మధ్యలో తీసుకునేవారు. అయితే బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న పెద్దికి భారీగా పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

బుచ్చిబాబు, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలకు తన పారితోషికాన్ని చెర్రీ భారీగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకు రూ.100 కోట్లకు తక్కువగా కాకుండా అడుగుతున్నారు. పాన్ ఇండియా హీరోలంతా రూ.100 కోట్లుగా తమకు పారితోషికాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తే తాము సినిమాలు తీయడం మానుకుంటామని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు.
నిర్మాతలవైపు నుంచి హీరోలు, దర్శకులు ఆలోచించడం మానుకున్నారని, నిర్మాతలంతా చులకనగా మారిందా? అంటూ కొందరు అగ్ర నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో నిర్మాతలంటే అందరూ గౌరవం ఇవ్వడంతోపాటు తమకు రూపాయి ఇచ్చే వ్యక్తి కాబట్టి పూజాభావంతో ఉండేవారని, ఇప్పుడు మాత్రం నిర్మాతలంటే తేలికభావంతో ఉంటున్నారని, ఇదే పరిస్థితులను, సందర్భాలను హీరోలు కొనసాగిస్తే భవిష్యత్తులో తగ్గించి ఇవ్వడమేకానీ పెంచి ఇచ్చేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి స్టార్ హీరోలు ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications